మహానటి చిత్రంతో తెలుగువారి మనసు దోచుకున్నాడు దుల్కర్ సల్మాన్ ..  అంతకు ముందు అతగాడి పలు డబ్బింగ్ చిత్రాలు కూడా తెలుగులో ఆకట్టుకున్నాయి. దానికితోడు  ఈ మధ్య ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రం ద్వారా కూడా  మంచి హిట్టు కొట్టాడు. ఇప్పుడు త్వరలో దుల్కర్ మరో స్ట్రైట్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. హను రాఘవపూడి దీనికి దర్శకుడు. నేడు దుల్కర్ సల్మాన్ పుట్టిన రోజును పురస్కరించుకొని .. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్ . ఇందులో దల్కర్ మిలటరీ మేన్  గా నటించబోతున్నట్టు పోస్టర్ ను బట్టి తెలుస్తోంది.

లెఫ్టినెంట్ రామ్ గా దుల్కర్ సల్మాన్ నటించబోతున్న ఈ సినిమా కు ఇంకా పేరు పెట్టలేదు. అయితే  లెఫ్టినెంట్ రామ్ యుద్ధంతో రాసిన ప్రేమకథ గా ఈ సినిమాకు  కేప్షన్ మాత్రం రివీలైంది. గన్ పట్టుకొన్న దుల్కర్ సిల్ హౌట్ లో రివీల్ అయిన స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  తెలుగు, తమిళ భాషల్లో  విడుదల కానున్న ఈ సినిమా త్వరలోనే లాంచ్ కాబోతోంది.  ఎప్పటి నుంచో హిట్టు కోసం ఎదురుచూస్తున్న హను రాఘవపూడి .. దుల్కర్ ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.

Leave a comment

error: Content is protected !!