ప్రస్తుత లాక్ డౌన్ టైమ్ ను చాలా మంది ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోని వెబ్ సిరీస్, సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మధ్య అందరికీ తెగ నచ్చేసిన సిరీస్ ‘మనీ హీస్ట్’. లా కెసాడె పాపెల్ అనే స్పానిష్ సిరీస్ ను మనీ హీస్ట్ గా అందించారు నెట్ ఫ్లిక్స్ వారు. రాయల్ మింట్ ఆఫ్ స్పెయిన్ నుంచి ఒక ఎనిమిది మంది దొంగలు మిలియన్స్ కేష్ మాయం చేయడం ఈ సిరీస్ కథాంశం. అయితే ఇందులో నటించిన నైరోబీ అనే పాత్ర పోషించిన స్పానిష్ సుందరి .. అల్బా ఫ్లోర్స్ ఈ సిరీస్ తో కోట్లాది మంది మనసు దోచేసింది. ఇందులో అమ్మడు భారతీయ యువతిగా నటించింది. ఇదిలా ఉంటే… అమ్మడు ఇప్పుడు మరో విధంగా కూడా వైరల్ అవుతోంది.

అదేంటంటే.. అల్బా ఫ్లోర్స్ .. అచ్చ తెలుగు అమ్మాయిలా చీరకట్టుకొని .. జడ వేసుకొని తెలుగు డైలాగ్స్ చెబుతూ.. ఆ  వీడియో లో కనిపించి.. అందరికీ షాకిచ్చింది. అసలు విషయమేంటంటే…  గతంలో అనంతపురంలో చిత్రీకరణ జరుపుకున్న విన్సెంట్ ఫెరారే బయోపిక్ లో అల్బా .. సమీరాగా నటించింది. అనంతపురం జిల్లాలోని కొన్ని వేల ఎకరాల్ని బంజరు భూములుగా మార్చిన మహానుభావుడు విన్సెంట్ ఫెరారే . ఆ బయోపిక్ లో భారతీయ యువతిగా నటించిన అమ్మడి చీరకట్టు లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

 

Leave a comment

error: Content is protected !!