Shopping Cart 0 items - $0.00 0

వైరల్ అవుతోన్న బాలయ్య న్యూ లుక్

‘రూలర్’ చిత్రంతో అభిమానుల్ని కాస్తంత నిరాశపరిచాడు నటసింహ నందమూరి బాలకృష్ణ. అయినాసరే దాని గురించి అసలేమీ ఆలోచించకుండా.. తదుపరి చిత్రం మీదే తన దృష్టి నంతటినీ కేంద్రీకరించాడు. ‘సింహా, లెజెండ్’ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందించిన బోయపాటి శ్రీనుతో ఆయన   నెక్స్ట్ మూవీని లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన పనులతో పూర్తి బిజీగా ఉన్నాడు బాలయ్య. అయితే  బాలకృష్ణ లుక్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో కోరమీసాలు, గుండు తో చిరునవ్వు నవ్వుతోన్న ఆ ఫోటోకి అభిమానులు ఫిదా అవుతున్నారు. 

ఆ ఫోటో  బోయపాటి సినిమాలోని బాలయ్య మేకోవర్ కు సంబంధించిన లుక్ అని ఫిల్మ్ నగర్ సమాచారం. అందులో ఆయన రెండు వైవిధ్యమైన పాత్రల్ని పోషించనున్నారని ఇదివరకూ వార్తలొచ్చాయి. బాలకృష్ణ ఎర్లియర్ మూవీ ‘రూలర్’ లోని ఆయన గెటప్ కు చాలా విమర్శలొచ్చిన నేపథ్యంలో బోయపాటి చిత్రంలో ఆయన తన గెటప్ మీద పూర్తి ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తోంది.  అందులో భాగంగానే ముందుగా ఈ లుక్ ను పీలర్ గా వదిలారని సినీ వర్గాలవారి భోగట్టా. మరి ఈ గెటప్ నిజంగా బోయపాటి సినిమాకి సంబంధించిందేనా లేక ఆయన పర్సనల్ గెటప్పా అన్న విషయం తెలియాల్సి ఉంది.

Leave a comment

error: Content is protected !!