కరోనా వైరస్ ప్రపంచ దేశాల్ని ఒణికిస్తోంది. మన దేశం ప్రస్తుతం లాక్ డౌన్ లో చిక్కుకుంది. ఈ విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోడానికి, లాక్ డౌన్ ప్రభావంతో జీవనోపాధి కోల్పోయిన సినీ కార్మికులకు , సాధారణ కూలీలకు చాలా మంది సినీ ప్రముఖులు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. టాలీవుడ్ వరకూ అయితే.. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటైన సిసిసి ద్వారా ఎందరో కార్మికులకు నిత్యావసర వస్తువుల కొరత తీరుతోంది. అలాగే..  కరోనాపై ప్రజలకు అవగాహన కలిపించడం లో అందరికంటే ముందు వరసలో ఉంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇటీవల సోషల్ మీడియా ద్వారా అలాగే సాంగ్ రూపంలో కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పిన చిరు తాజాగా నేషనల్ మీడియా ద్వారా కూడా మరోసారి అలాంటి సందేశాన్ని ఇచ్చారు.

 అందులో భాగంగా నిన్న రిపబ్లిక్ టీవి ఇంటర్వ్యూ లో పాల్గొన్న చిరంజీవి దేశ వ్యాప్తంగా వున్న తెలుగు వారి కోసం తెలుగులో సందేశం ఇచ్చాడు. కరోనా శాశ్వతం గా ఉండిపోదు కానీ తగిన జాగ్రత్తలు తీసుకొని మీతో పాటు మీ చుట్టుపక్కల వారిని కూడా కాపాడుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన రిపబ్లిక్ టీవి  యాజమాన్యానికి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.

Leave a comment

error: Content is protected !!