Shopping Cart 0 items - $0.00 0

పెద్దింటల్లుడు

 

టాలీవుడ్ యాక్షన్ హీరో సుమన్  కెరీర్ లో ప్రత్యేకమైన చిత్రం ‘పెద్దింటల్లుడు’. హీరోయిన్ గా నగ్మా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన చిత్రంగా కూడా ప్రత్యేకతను సంతరించుకొన్న ఈ సినిమా కు శరత్ దర్శకుడు. శ్రీ అన్నపూర్ణ సినీ చిత్ర బ్యానర్ పై టీ.ఆర్.తులసి నిర్మించిన ఈ సినిమా ఒన నిరుద్యోగ యువకుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఒక డబ్బున్నవారి ఇంట్లోకి ఒక వృద్ధ సంగీతం టీచర్ గా ప్రవేశిస్తాడు. అదే సమయంలో ఆ ఇంట్లోని అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ క్రమంలో జరిగే క్యాట్ అండ్ మౌస్ డ్రామానే ఈ సినిమా కథ. వాణీశ్రీ, బాబూ మోహన్, మోహన్ బాబు, ప్రతాప్ చంద్రన్, పొట్టి ప్రసాద్, డబ్బింగ్ జానకి తదితరులు నటించిన ఈ సినిమా టాలీవుడ్ లో రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. నిజానికి ‘పెద్దింటల్లుడు’ చిత్రం  1962లో బాలీవుడ్ లో వచ్చిన సూపర్ హిట్టు మూవీ ప్రాఫెసర్ కు రీమేక్ అని చెప్పుకోవాలి. అదే సినిమా అప్పట్లో యన్టీఆర్ తో ‘భలే మాస్టారు’ గా రీమేక్ చేశారు. అయితే అప్పటి పాత సినిమానే పి.వాసు 1991 లో ‘నడిగన్’ పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. సత్యరాజ్ హీరోగా నటించిన ఆ సినిమా సూపర్ హిట్టు అవడంతో ఆ సినిమానే తెలుగులో ‘పెద్దింటల్లుడు’ పేరుతో రీమేక్ చేశారు.

Leave a comment

error: Content is protected !!