నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న రోజారమణి కెరీర్ బిగినింగ్ లో నటించిన ప్రేమకథా చిత్రం ‘కన్నెవయసు’. శ్రీగౌరీ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై యస్వీయల్ నరసింహారావు నిర్మాణంలో ఓ.యస్.ఆర్ . ఆంజనేయులు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్టైంది. లక్ష్మీకాంత్, యం.పి.ప్రసాద్ , కె.వెంకటేశ్వరరావు , శరత్ బాబు, నిర్మలమ్మ, విజయ, సువర్ణ, అల్లు రామలింగయ్య తదితరులు నటించిన ఈసినిమాకు సంగీతం సత్యం. ఏ దివిలో విరిసిన పారిజాతమో పాట ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచిపోయింది.

శాంతి అనే అమాయకురాలైన ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఆరాధిస్తాడు. అయితే అతడి ప్రాణ స్నేహితుడే ఆ అమ్మాయిని మానభంగం చేస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని తన స్నేహితుడ్ని తిరిగి ఏలుకోమని కోరతాడు. కానీ దానికి అతడు అంగీకరించడు. దాంతో తన స్నేహితుడ్ని ఒదులుకోలేక.. శాంతిని చంపేస్తాడు అతడు. చివరికి ఆ అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి  శాంతికోసం ప్రాణాలొదిచేయడంతో సినిమా ముగుస్తుంది. నిజానికి  ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ ‘చంబరతి’ సినిమాకి రీమేక్ వెర్షన్ . అక్కడ కూడా రోజా రమణియే హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఇదే సినిమా తమిళంలో కమల్ హాసన్ హీరోగా పరువకాలంగా రీమేక్ అయింది.  

Leave a comment

error: Content is protected !!