Shopping Cart 0 items - $0.00 0

నువ్వు వస్తావని

 

అక్కినేని నాగార్జున కెరీర్ లో ఫీల్ గుడ్ మూవీగా పేరు తెచ్చుకున్న సూపర్ హిట్ మూవీ ‘నువ్వు వస్తావని’. 2000 ఏప్రిల్ 5న విడుదలైన ఈ సినిమా కథ పరంగానూ, మ్యూజికల్ గానూ అందరినీ మెప్పించింది.  అందాల సిమ్రాన్ కథానాయిక గా నటించిన ఈ సినిమా ను వి.ఆర్.ప్రతాప్ దర్శకత్వంలో ..  సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ పై ఆర్.బీ .చౌదరి నిర్మించారు. కోటశ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, ఆలి, సుధాకర్, మల్లికార్జున రావు, సూర్య, శివాజీరాజా తదితరులు నటించిన ఈ సినిమా కథ చాలా సెన్సిటివ్ గానూ సెన్స్ బుల్ గానూ ఉంటుంది. అంధురాలైన ఒక అమ్మాయి తాను ఇష్టపడే పాటలు పాడే అబ్బాయినే తాను ఇన్నాళ్ళూ ద్వేషిస్తున్నానని తెలుసుకొని పశ్చాత్తాపంతో అతడితో ప్రేమలో పడడమే చిత్రకథ. ఈ సినిమాకి కథ ఒకరకంగా అసెట్ అయితే..  మరో రకంగా యస్.ఏ రాజ్ కుమార్  సంగీతం ప్రాణం పోసింది. పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి, కలలోనైన కలగనలేదే నువు వస్తావని లాంటి పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల్ని ఊర్రూతలూగిస్తునే ఉన్నాయి. ఇక ఈ సినిమా నిజానికి దళపతి విజయ్ హీరోగా నటించిన ‘తుల్లాదమనముమ్ తుల్లుమ్’ తమిళ చిత్రానికి రీమేక్. ఎళిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోలీవుడ్ లో రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. ఓ రకంగా విజయ్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది ఈ సినిమానే.  

Leave a comment

error: Content is protected !!