ప్రపంచ దేశాల్ని కరోనా గడగడలాడిస్తోన్న వేళ.. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమార్ధం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఎవరింటిలో వారుంటూ.. సోషల్ డిస్టెన్సింగ్ ను మెయిన్ టెయిన్ చేస్తున్న ఈ తరుణంలో కొందరు యువ దర్శకులు తాపీ గా మంచి మంచి కాన్సెప్ట్స్ తో కథలు రెడీ చేసుకుంటున్నారు. అందులో ప్రశాంత్ వర్మ కూడా ఒకడు. అ, కల్కి చిత్రాలతో మంచి దర్శకుడిగా ముద్ర వేయించుకొన్న అతగాడు ఇప్పుడు కరోనా వైరస్ మీద సినిమా తీయబోతున్నట్టు సమాచారం.
నిజానికి ప్రశాంత్ వర్మ కరోనా రాక ముందే అంటే డిసెంబర్ నెల్లోనే వైరస్ మీద సినిమా తీయాలని అందుకు తగ్గట్టుగా స్ర్కిప్ట్ రాయడం మొదలు పెట్టాడట. ఓ అప్ కమింగ్ యంగ్ హీరోతో ప్రశాంత్ వర్మ ఈ సినిమా ప్లాన్ చేసారని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా అయిపోయిందని తెలుస్తోంది. ఇప్పటి వరకు రెండు సినిమాలు తీసిన ప్రశాంత వర్మ, ఓ వైవిధ్యమైన దర్శకుడిగా ఎలివేట్ అయ్యాడు. ఇప్పడు కరోనా మీద సినిమా తీస్తే, దాన్ని నిలబెట్టుకున్నట్లు అవుతుంది. అందుకే ఆ దిశగా ప్రశాంత్ వర్మ అడుగులు వేస్తున్నట్లు బోగట్టా. ఇలాంటి పానిక్ సినిమాలు హాలీవుడ్ లో కాస్త పకడ్బందీ స్క్రిప్ట్ తో భారీగా రెడీ అవుతాయి. ఇప్పుడు ప్రశాంత్ వర్మ మాత్రం చిన్న హీరోతో డిఫరెంట్ గా చేయాలని ప్రయత్నిస్తున్నారు.