పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘వకీల్ సాబ్ ’. బాలీవుడ్ హిట్ చిత్రం ‘పింక్’ కు ఇది రీమేక్ వెర్షన్ అన్న సంగతి తెలిసిందే. అత్యాచారం జరిగిన ఒకమ్మాయికి న్యాయస్థానంలో ఏవిధంగా న్యాయం జరుగుతుంది? దానికోసం వకీల్ సాబ్ ఏ రీతిలో తన వాదోపవాదనలు వినిపించాడు అన్నదే ఈ సినిమా కథాంశం . సమ్మర్ కానుకగా మే నెల్లో  విడుదల కానున్న ఈ సినిమాకి యస్.యస్ . తమన్ సంగీతం అందిస్తూండగా.. ఈ సినిమాలోని తొలి సింగిల్ ను మహిళా దినోత్సవం సందర్భంగా నిన్ననే విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మగువా మగువా అంటూ సాగే మెలోడీ గీతాన్ని  సిద్ శ్రీరామ్ ఆలపించగా.. అప్పుడే ఈ పాట టాలీవుడ్ లో ట్రెండింగ్ గా మారింది. ప్రముఖ గీత రచయిత రామ జోగయ్యశాస్త్రి స్త్రీ శక్తిని కీర్తిస్తూ.. తన కలాన్ని ఎంతో ఆర్ద్రంగా కదలిస్తూ రాసిన ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ పాటకు సంబంధించిన లిరిక్ షీట్ ను సోషల్ మీడియాలో విడుదలచేశారు.  చక్కటి పదవిన్యాసంతో సాగే ఈ పాట రచన కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Leave a comment

error: Content is protected !!