మాస్ మూవీస్ కు , పవర్ ఫుల్ డైలాగ్స్ కు పెట్టింది పేరు నందమూరి నటసింహం బాలకృష్ణ. అలాంటి ఆయనకు బి.గోపాల్ లాంటి డైనమిక్ డైరెక్టర్ తోడైతే ఎలా ఉంటుంది? ఈ కాంబోను  రిపీట్ చేయడానికి మళ్ళీ రైటర్ చిన్ని కృష్ణ రంగంలోకి దిగుతున్నాడనే టాక్ వినిపిస్తోంది. గతంలో ఈ ట్రయో కలిసి ‘నరసింహనాయుడు’ లాంటి సూపర్ హిట్ మూవీని అందించిన సంగతి తెలిసిందే. గతంలో బి.గోపాల్ , బాలయ్య కలయికలో లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్ పెక్టర్, సమరసింహారెడ్డి,  నరసింహనాయుడు లాంటి  హిట్ చిత్రాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో  మరో పవర్ ఫుల్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయ్యే టైమ్ కు .. బి.గోపాల్ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళనుందని ఫిల్మ్ నగర్ టాక్. బోయపాటి చిత్రం తర్వాత మరో సినిమాను ఇంతవరకూ బాలయ్య కన్ఫార్మ్ చేయలేదు. కాబట్టి.. మూడొంతులు గోపాల్ దర్శకత్వంలోనే ఆయన తదుపరి చిత్రం ఉంటుందని వినికిడి. మరి ఈ సారి బి.గోపాల్ బాలయ్యకు ఏ తరహా చిత్రం అందిస్తాడో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!