త్రివిక్రమ్ శ్రీనివాస్.. స్టోరీ ఎలా వున్నా మాటలతో మాయ చేసి, టేకింగ్‌తో మేజిక్ చేసే దర్శకుడు. గన్ చూడాలనుకో తప్పులేదు, బుల్లెట్ చూడాలనుకోకు చచ్చిపోతావ్. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. బాగున్నపుడు లెక్కలు కష్టాలొచ్చినపుడు విలువలు మాట్లాడకూడదు. పక్క పక్క అక్షరాలు.. పరిచయం కావడానికి పాతికేళ్లు పట్టింది. ఇలాంటి మనకు తెలిసిన మాటల్ని మనకే కొత్తగా పరిచయం చేస్తూ.. మనచేతే వారెవ్వా అనిపించడం త్రివిక్రమ్ స్టైల్. ముఖ్యంగా కామెడీని ప్రజెంట్ చేయడంలో త్రివిక్రమ్ స్టైలే వేరు. కామెడీ రాయాలన్నా తీయాలన్నా రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్‌కు ఎంత సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి, ఆయనకెంత ప్లెజంట్ మూడ్ కావాలి. కానీ రైటర్‌కు ఎన్ని బాధలున్నా ప్రేక్షకులని నవ్వించేలా రాయాలి. డైరెక్టర్‌కు ఎంత పెయిన్ వున్నా కామెడీని పర్‌ఫెక్ట్‌గా ప్రజెంట్ చేయాలి. అందుకు ఉదాహరణ త్రివిక్రమ్ శ్రీనివాస్.
విషయంలోకెళ్తే.. త్రివిక్రమ్ ప్రతీ సినిమాలో కామెడీ వున్నా అతడు సినిమా కామెడీని మాత్రం ఎవ్వరూ మర్చిపోలేరు. ముఖ్యంగా మహేష్, బ్రహ్మీల మధ్య వచ్చే కామెడీ సీన్స్ మాత్రం కెవ్వు కేక. ఇది ఐరన్ బాడీ హిట్ మి హాట్ యార్ అంటూ మహేష్‌ను ఫోర్స్ చేసే సీన్ సినిమాకు హైలెట్. ఇలాంటి వ్యక్తులు మనింట్లోనోక పక్కింట్లోనూ, మన ఊర్లోనో, తెలిసిన వాళ్లలోనో ఎవరో ఒకరు కనిపిస్తారు. అందుకే ఆ క్యారెక్టర్ ఆడియెన్స్‌కు అంతలా కనెక్ట్ అయ్యింది. ఈ సీన్ తీసేటపుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మనసులో ఎంతో బాధుంది. ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఆయనకు ఆ రాత్రి నిద్ర లేకుండా చేసింది. ఆ బాధను పక్కనబెట్టి మరీ ఈ సీన్ తీసారట.
అతడు సినిమాలో బ్రహ్మీ, త్రిష, మహేష్ బాబుల మధ్య వచ్చే కామెడీ సీన్ ఇది. ఈ సీన్‌ను నానక్ రామ్ గూడ లో లంకంత హౌస్ సెట్‌లో పిక్చరైజ్ చేస్తున్నారు. ఈ సీన్‌లో మహేష్, త్రిష, బ్రహ్మానందంతో పాటు ధర్మవరపు సుబ్రమణ్యం, గిరిబాబు, ఫ్యామిలీ మెంబర్స్, చైల్డ్ ఆర్టిస్టులు అంతా షూట్‌లో పాల్గొన్నారు. అయితే ఆ సీన్ రేపు షూట్ జరగబోతుందనగా త్రివిక్రమ్ గారబ్బాయికి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. హాస్పిటల్‌లో చేర్చాల్సి వచ్చింది. ఆరోజంతా హాస్పిటల్‌లో ఉండాల్సి వచ్చింది. రాత్రంతా నిద్రలేదు. తెల్లవారు ఝామున ఇంటికెళ్లి ఫ్రెష్ అయి డైరెక్ట్‌గా లొకేషన్‌కి వచ్చి ఆ కామెడీ సీన్ తీసాడట. ఒకవేళ తన వలన షూట్ క్యాన్సిల్ అయితే అంతమంది ఆర్టిస్టుల కాల్‌షీట్లు క్యాన్సిల్ అవుతాయి. నిర్మాతకు చాలా నష్టం వస్తుంది. ఎందుకు రిస్క్ అని తన పర్సనల్ పెయిన్ మర్చిపోయి నిర్మాత గెయిన్ గురించి ఆలోచించారు. మనసులో ఎంత బాధున్నా సీన్ అంత పర్‌ఫెక్ట్‌గా తీయగలిగారు. అందుకే త్రివిక్రమ్ గ్రేట్ డైరెక్టర్ అంటారు.