సింహాద్రి.. ఎన్టీఆర్, రాజమౌళి కెరియర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మాస్ మూవీ. ఈ సినిమాతో తారక్ అదిరిపోయే మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కీరవాణి పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వన్ ఆఫ్ ది అస్సెట్. ముఖ్యంగా నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి పాట ఎవర్‌గ్రీన్ మాస్సివ్ హిట్‌గా నిలిచింది. ధియేటర్లో ఆడియెన్స్ చేత డాన్సులు చేయించింది అంటే అర్ధం చేసుకోవచ్చు కీరవాణి చేసిన మ్యూజిక్ మేజిక్ ఏంటో. అయితే ఈ పాట సింహాద్రి కోసం ట్యూన్ చేసింది కాదట.
విషయంలోకి వెళ్తే… మోహన్ బాబు, శ్రీకాంత్ హీరోలుగా తప్పు చేసి పప్పు కూడా అనే సినిమా వచ్చింది. ఈ సినిమాకు కూడా కీరవాణే మ్యూజిక్ డైరెక్టర్. ఆ సినిమా టైమ్‌లోనువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డి పాట ట్యూన్ చేసారట. కానీ ఈ ట్యూన్ కాకుండా వేరే ట్యూన్ కావాలని అడిగారట. అలా మోహన్ బాబు వద్దన్న ఆ ట్యూన్ ను సింహాద్రిలో వాడి అదిరిపోయే హిట్ కొట్టారు ఎంఎం కీరవాణి. ఒక సినిమా కోసం చేసిన ట్యూన్ మరో సినిమాలో ఉపయోగించడం పెద్ద హిట్ కొట్టడం అనేది యాదృచ్ఛికంగా జరిగినా సక్సెస్ మాత్రం పదికాలాల పాటు నిలిచింది. ఇలాంటివి సినీ ఇండస్ట్రీలో కామన్‌గానే జరుగుతూనే ఉంటాయి. ఇదే సినిమాలో అమ్మయినా నాన్నయినా అనే పాట మెలోడి సాంగ్ కూడా వుంది. ఈ పాట ట్యూన్ కిష్కిందకాండలోనిది.
లరిక్స్ వేరయినా ట్యూన్ మాత్రం సేమ్ వుంటుంది. ఆ పాట విన్న రాజమౌళి.. ఇలాంటి ట్యూన్ సింహాద్రి కోసం రిపీట్ చేస్తే బాగుంటుందని చెప్పి మరీ పాట చేయించాడట రాజమౌళి.