Shopping Cart 0 items - $0.00 0

మహేశ్ ‘ఒక్కడు’ టైటిల్ కి అంత స్టోరీ ఉందా?

 

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు కెరీర్‌కు బాగా బూస్ట‌ప్ ఇచ్చిన మూవీ ఒక్క‌డు. ఈ మూవీకి ముందు వ‌చ్చిన రాజ‌కుమారుడు, మురారి, చిత్రాలు
హిట్ట‌య్యాయి. యువ‌రాజు, బాబీ, వంశీ, ట‌క్క‌రి దొంగ సినిమాలు మాత్రం ఫ్లాప‌య్యాయి. ఈ ఆరు చిత్రాల త‌ర్వాత వ‌చ్చిన మూడ‌క్ష‌రాల ఏడో చిత్రం మాత్రం బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. అంతేకాదు మ‌హేష్ కు విప‌రీత‌మైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో మ‌హేష్, ప్ర‌కాశ్‌రాజ్‌ల ప‌ర్‌ఫార్మెన్స్‌, మ‌హేష్ చేసిన రిస్కీ ఫైట్స్ , పాట‌లు, ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌మ‌ణ్యం కామెడీ, అందాల భూమిక సెటిల్డ్ ప‌ర్‌ఫార్మెన్స్‌, క్లైమాక్స్‌లోవ‌చ్చే కబ‌డ్డీ సీన్స్ హైలెట్‌గా నిలిచి రిపీట్ ఆడియెన్స్‌కు స్కోప్ ఇచ్చాయి. క‌లెక్ష‌న్ల వ‌ర్షంతో పాటు అవార్డుల ప‌రంప‌ర కూడా కొన‌సాగించింది ఒక్క‌డు. నంది, ఫిలింఫేర్ అవార్డ్స్ లోఒక్క‌డు స‌త్తా చాటింది. ఇంత హిట్ అయిన ఈ మూవీకి గుణ‌శేఖ‌ర్ ముందు అనుకున్న టైటిల్ మాత్రం ఒక్కడు కాదు.ఈ చిత్రానికి గుణ‌శేఖ‌ర్ పెట్టిన పేరు అత‌డే ఆమె సైన్యం. అయితే అప్ప‌టికే వేరే వాళ్లు ఈ టైటిల్ రిజ‌స్టర్ చేసున్నారు. అయితే ఈ టైటిల్ క‌రెక్ట్‌గా యాప్ట్ అవుతుంద‌ని గుణ‌శేఖ‌ర్ఒరిజిన‌ల్ రైట్స్ వున్నవారి ద‌గ్గ‌ర్నుంచి తీసుకోవాల‌ని ప్ర‌య‌త్నించారు. అయితే ఆ ప్ర‌య‌త్నం స‌క్సెస్ కాలేదు. దీని త‌ర్వాత క‌బ‌డ్డీ అనే టైటిల్ పెడ‌దామ‌నుకున్నారు. అయితే అదికూడా కుద‌ర‌లేదు. ఫైన‌ల్‌గా ఒక్క‌డు అనే మూడ‌క్ష‌రాల టైటిలే టీమ్ అంద‌రికీ న‌చ్చ‌డంతో టైటిల్ క‌న్‌ఫ‌ర్మ్ చేసారు. ఇక్క‌డ ఇంట్ర‌స్టింగ్ విష‌యం ఏంటంటే.. అత‌డే ఆమె సైన్యం అనేటైటిల్‌తో ఇప్ప‌టిదాకా ఏ సినిమా రిలీజ్ కాలేదు. మ‌రి ఆ టైటిల్‌ని ఎందుకు, ఎవ‌రు రిజ‌స్ట‌ర్ చేశారో…?

Leave a comment

error: Content is protected !!