Prabhas – Hanu combo :  రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం పూర్తవక ముందే, ప్రభాస్ తన తదుపరి చిత్రం ‘ఫౌజీ’ షూటింగ్‌ను కూడా ప్రారంభించాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 1945 నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. ‘ఫౌజీ’ చిత్ర షూటింగ్ తమిళనాడులోని మధురైలో ప్రారంభమైంది.  అయితే ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ పాల్గొనకుండా, ఇతర నటీనటులతో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ సుమారు ఒక వారం పాటు కొనసాగనుంది. ప్రభాస్ ‘రాజా సాబ్’ చిత్రీకరణను పూర్తి చేసిన తర్వాత ‘ఫౌజీ’ చిత్రంలో జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Leave a comment

error: Content is protected !!