Vishwaksen : ఇప్పుడు టాలీవుడ్ లో తన టాలెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్న యువ నటుల్లో విశ్వక్ సేన్ ఒకరు. తన ప్రతి సినిమాతో ప్రయోగాలు చేస్తూ.. ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ వస్తున్నాడు విశ్వక్ . తన నటనతో పాటు దర్శకుడిగా, స్క్రీన్‌ప్లే రచయితగా కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు.

తన కెరీర్ ప్రారంభంలోనే విశ్వక్ సేన్ విభిన్నమైన పాత్రలను ఎంచుకున్నాడు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలో గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా కమర్షియల్‌గా సూపర్ హిట్ కాకపోయినా.. బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక దీంతో పాటు ‘లైలా’ అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు.

ఇవి కాకుండా విశ్వక్ సేన్ నటిస్తున్న 13వ సినిమా కు సంబంధించిన ప్రీ-లుక్ పోస్టర్ తాజాగా విడుదలైంది. అది సినిమాపై భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీధర్ గంటా దర్శకత్వం వహిస్తున్నారు. గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించ బోతున్నాడు. అజనీష్ లోకనాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ‘VS13’ ప్రీ-లుక్ పోస్టర్‌లో విశ్వక్ సేన్ ముఖం పూర్తిగా కనిపించకుండా ఉండటం ఆసక్తికరంగా ఉంది. ఈ పోస్టర్ చిత్రంపై భారీ అంచనాలను నెలకొల్పింది.

Leave a comment

error: Content is protected !!