Rananaidu 2 :  బాబాయ్ విక్టరీ వెంకటేష్, అబ్బాయ్  రానా దగ్గుబాటి తండ్రీకొడుకులుగా  నటించడమే కాకుండా..  మొదటిసారిగా డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన  “రానా నాయుడు” వెబ్ సిరీస్ మొదటి సీజన్ విజయవంతమైంది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ఈ సిరీస్‌కు అద్భుతమైన స్పందన లభించింది. అసభ్యకరమైన భాష వాడారని విమర్శలు వచ్చినప్పటికీ.. ఈ వెబ్ సిరీస్ కొంతకాలం పాటు నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ అయింది.

ఇప్పుడు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సీజన్ 2 షూటింగ్ జరుగుతోంది అని మేకర్లు అధికారికంగా ప్రకటించారు.  ఈ సీజన్‌లో రానా, వెంకటేష్‌లతో పాటు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. సీజన్ 2 ఎప్పుడు స్ట్రీమవుతుందో అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. అయితే త్వరలోనే ఈ విషయంపై మేకర్లు క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రానా నాయుడు సీజన్ 2 కి సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమన్ దర్శకత్వం వహిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!