Gamechanger : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “గేమ్ చేంజర్”. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. థమన్ సంగీతం అందించారు.

“RRR” తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. “ఇండియన్ 2” డిజాస్టర్ తో శంకర్ కొంత ఇబ్బంది పడ్డాడని చెప్పాలి కానీ, తన గత చిత్రాల విజయాలతో తన సత్తా చాటిన దర్శకుడు కావడంతో ఈ సినిమాపై అందరి నమ్మకం కూడా బాగానే ఉంది. అయితే ఈ సినిమా విడుదల గురించి మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇటీవల భారతీయుడు 2 విడుదలవడంతో గేమ్ ఛేంజర్ విడుదల తేదీని నిర్మాతలు ఎప్పుడు ప్రకటిస్తారు అనే ఆసక్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు దిల్ రాజు.

ఇటీవలే “రాయన్”  సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమా రిలీజ్ గురించి అడిగినప్పుడు క్రిస్మస్ కు కలుద్దాం అని రిప్లై ఇచ్చారు. దాంతో ఈ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కాబోతోందని తేలిపోయింది. ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్ లో 15వ సినిమా కావడంతో పాటు, శంకర్ తొలి తెలుగు సినిమా కూడా కావడం గమనార్హం.
“గేమ్ చేంజర్” లో రామ్ చరణ్ తండ్రీకొడుకులుగా తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కియారా అద్వానీ, అంజలి, సూర్య, శ్రీకాంత్, జయరామ్, సునీల్, సముద్రఖని, నాసర్ తదితరులు ఈ చిత్రంలో నటించారు.

Leave a comment

error: Content is protected !!