Kalavedika NTR Filmawards 2024 :  విశ్వ విఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డా. నందమూరి తారకరామారావు పేరిట సినీరంగంలోని అన్నివిభాగాల్లోని నటీనటులకు ‘కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024’ అందించబడతాయి. నేడు హైదరాబాద్‌లోని హోటల్ దసపల్లాలో అతిరధమహారథుల సమక్షంలో ఈ అవార్డుల  ప్రదానోత్సవం జరగనుంది. కళావేదిక ని రాఘవి మీడియా సగర్వంగా నిర్వహిస్తోంది.

ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు, నిర్మాణ, చలనచిత్ర శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి, పంచాయత్ రాజ్, తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ , సంచలన దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ నారా రోహిత్,  హీరోయిన్ అనన్య నాగళ్ల, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పాల్గొన్నారు.

Leave a comment

error: Content is protected !!