Revu movie : వంశీరామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి నటించిన చిత్రం వైవిధ్యభరితమైన చిత్రం రేవు. మురళి గింజుపల్లి, నవీన్ పారుపల్లి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణాన్ని సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు పర్యవేక్షిస్తూండగా, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రానికి హరినాథ్ పులి దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రేవు చిత్రం త్వరలో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్ర విశేషాలను వెల్లడించారు.

Leave a comment

error: Content is protected !!