Samantha : అగ్ర కథానాయిక సమంత సినీ రంగంలో పోటీతత్వాన్ని సానుకూలంగా స్వీకరిస్తానని, అది మరింత కష్టపడి పనిచేయడానికి తనకు ప్రేరణనిస్తుందని తెలిపింది. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ వెబ్‌సైట్‌ ఐఎండీబీ విడుదల చేసిన ‘టాప్‌ 100 మోస్ట్‌ వ్యూవ్డ్‌ ఇండియన్‌ స్టార్స్‌’ జాబితాలో సమంత 13వ స్థానాన్ని దక్కించుకున్న నేపథ్యంలో ఈమె ఈ విషయాలు మాట్లాడారు.

“ప్రతి రంగంలో పోటీ ఉంటుంది. నేను నా సహనటీమణులను చూసి స్ఫూర్తి పొందుతాను. వారిలా విజయాలు సాధించాలంటే మరింతగా కష్టపడాలని అనుకుంటాను. పోటీతత్వం మనలోని సృజనాత్మక శక్తులను వెలికితీస్తుంది. పోటీ ఉంటేనే మన ప్రతిభ మరింతగా మెరుగుపడుతుందని నేను నమ్ముతున్నాను” అని సమంత ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం సమంత ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో నటిస్తున్నారు. సొంత నిర్మాణ సంస్థలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!