Family man3 : ఇండియన్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ .. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ అద్భుతమైన సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ తో దర్శక ద్వయం రాజ్ అండ్ డికెలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ది ఫ్యామిలీ మ్యాన రెండవ సీజన్ కూడా అదే మ్యాజిక్ కు రిపీట్ చేసింది. ఇప్పుడు ఫ్యామిలీ మేన్ సిరీస్ 3వ సీజన్ రాబోతోంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో.. ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3 కోసం భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ఈ సిరీస్ షూట్ లేటెస్ట్ గా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అమెజాన్ దాని గురించి అధికారికంగా అనౌన్స్ మెంట్ ఇచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో మనోజ్ బాజ్‌పేయ్ శ్రీకాంత్ తివారీ పాత్రలో మళ్లీ కంటిన్యూ అవుతున్నాడు.

ప్రియమణి (సుచిత్రా తివారీ), షరీబ్ హష్మీ (జెకె తల్పాడే), ఆశ్లేషా ఠాకూర్ (ధృతి తివారీ), వేదాంత్ సిన్హా (అథర్వ్ తివారీ) ది ఫ్యామిలీ మ్యాన్ 3 లోని ఇతర పాత్రలను తిరిగి పోషించనున్నారు2025 ద్వితీయార్ధంలో ఫ్యామిలీ మేన్ 3 సిరిస్ అందుబాటులోకి వస్తుంది.

Leave a comment

error: Content is protected !!