శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘అయలాన్’. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఆర్. రవికుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కెజెఆర్ స్టూడియోస్ పతాకంపై కోటపాడి జె. రాజేష్ నిర్మించగా… ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఈ నెల 12న సంక్రాంతి కానుకగా తమిళనాడులో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 26న గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ద్వారా మహేశ్వర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. సినిమా విడుదల సందర్భంగా తెలుగు మీడియాతో శివకార్తికేయన్ ముచ్చటించారు.
‘అయలాన్’ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారు. నేను ఓ హీరో అయితే‌… మరొక హీరో ఏలియన్.’అయలాన్’ సినిమా దర్శకుడు రవికుమార్ విజన్. 4500 వి.ఎఫ్.ఎక్స్ షాట్స్ ఉన్నాయి. రోబో, 2.ఓ సినిమాల్లో కంటే ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న చిత్రం ఇది. మా బడ్జెట్ తక్కువ. పరిమిత నిర్మాణ వ్యయంలో గనుక సినిమా తీయగలిగితే మరింత పెద్ద కలలు కనవచ్చు అని అనిపించింది. అందుకే ఎక్కువ రోజులు పట్టిన తప్పకుండా ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను.


నేను హాలీవుడ్ సినిమా పేరు చెప్పను కానీ… మేము తీసిన సన్నివేశం ఆ తర్వాత విడుదలైన ఓ సినిమాలో ఉంది. ఫాంటసీ సూపర్ హీరో ఫిలిం కాబట్టి కొన్ని కొన్ని సన్నివేశాలు మనం ముందు తీసినప్పటికీ… తర్వాత విడుదలైన కొన్ని సినిమాల్లో ఉండొచ్చు. అయితే… ఏలియన్ – మనిషి మధ్య సన్నివేశాలు, వాళ్ళిద్దరి ఇంటరాక్షన్, అయలాన్ కోర్ పాయింట్ మీద ఇప్పటివరకు సినిమా రాలేదు. మా స్క్రిప్ట్ ఐడియా ఇప్పటికీ కొత్తగా ఉంది. ఒకవేళ మా దర్శకుడు కనక ఇప్పుడు స్క్రిప్ట్ రాస్తే స్క్రీన్ ప్లే మార్పులు ఏమైనా చేస్తాడేమో. తమిళనాడులో సినిమా చూసిన వాళ్ళు ఎవరు కథపై కంప్లైంట్స్ చేయలేదు. చాలా కొత్తగా ఉందని చెప్పారు. అది మా అదృష్టం అన్నారు శివకార్తికేయన్‌.
రెహమాన్ గారితో ప్రమోషనల్ సాంగ్ కోసం చిన్న స్టెప్ వేశారు. మేం ఆయనతో రెండు గంటలు డ్యాన్స్ చేయించాం. ఏలియన్ క్రియేట్ చేయడానికి మేం చాలా రీసెర్చ్ చేశాం. ఎక్కువ టైమ్ స్పెండ్ చేశాం. సీక్వెల్ ఐడియా మాకు ముందు నుంచి ఉంది. సీక్వెల్ ఇంకా బిగ్గర్ స్కేల్ లో చేస్తాం. తమిళనాడులో సక్సెస్ మమ్మల్ని మోటివేట్ చేసిందన్నారు శివకార్తికేయన్.
నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌ గురించి చెప్తూ.. కమల్ హాసన్ నిర్మాణంలో ఆల్రెడీ 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేశాం. జానర్, సినిమా స్టైల్ గురించి ఇప్పుడు నేను చెప్పలేను. అందులో నేను, సాయి పల్లవి నటిస్తున్నాం. వేసవిలో విడుదల కావచ్చన్నారు శివకార్తికేయన్‌.
ఆల్‌ది బెస్ట్ శివకార్తికేయన్.

Leave a comment

error: Content is protected !!