గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘గేమ్ ఆన్’. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్ శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న గ్రాండ్ గా విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాదులోని ప్రసాద్ లాబ్స్ లో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ…” ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. నేను ఆస్ట్రేలియాలో ఉంటాను. గీతానంద్ నా క్లాస్మేట్. ఏదో ఒక రోజు సినిమా తీద్దామని అనుకున్నాం. మంచి కథతో ఈ సినిమాను స్టార్ట్ చేసాం. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా దీన్ని రూపొందించాం. ప్రతి విషయంలో క్వాలిటీ ఉండేలా చూసుకున్నాం. ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా సినిమా ఉంటుంది. నవాబ్ గ్యాంగ్స్ అద్భుతమైన పాటలు ఇచ్చారు అవి అందర్నీ ఆకట్టుకునేలా ఉంటాయి. ఇలాంటి కథ ఇప్పటివరకు తెలుగు తెరపై రాలేదు”. అని చెప్పారు.
దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ ‘‘ కమర్షియల్ స్క్రిప్ట్ ని రా అండ్ రస్టిక్ గా చిత్రీకరించాను. పూరి జగన్నాథ్ ఫ్యాన్ గా ఈ సినిమాను డైరెక్ట్ చేశాను.
ఈ చిత్రంలో పాత్రలన్నీ గ్రే షేడ్‌లో ఉంటాయి. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. తన జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి ,రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు? గేమ్‌లోని టాస్క్‌ను ఎలా స్వీకరించాడు? అసలు ఆ గేమ్ ఎంచుకోబడడానికి కారణం ఏమిటి? ఈ గేమ్ ఎవరు ఆడిస్తున్నారు? అనే అంశాలతో ‘గేమ్ ఆన్’ సినిమా తెరకెక్కింది. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. కచ్చితంగా మా సినిమా ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఈ జర్నీలో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసాం. గీతానంద్ ఇంటెన్స్ క్యారెక్టర్ చేశాడు. మధు బాల గారు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాకపోయినా ఫ్యామిలీ డార్క్ ఎమోషన్స్ ఉంటాయి” అని చెప్పారు.
ఆదిత్య మీనన్ మాట్లాడుతూ… కొత్తవారిని ప్రేక్షకులు సపోర్ట్ చేస్తే ఇలాంటి కొత్త కథలు ఇంకా వస్తుంటాయి. రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ దయానంద్ రాశారు” అని చెప్పారు.
నేహా సోలంకి మాట్లాడుతూ.. ” ఇలాంటి పాత్రను గతంలో నేనెప్పుడూ చేయలేదు. అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా” అని అన్నారు.
గీతానంద్ మాట్లాడుతూ.. ” ట్రైలర్ లో చూసింది 10% మాత్రమే. ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాం. మంచి కాన్సెప్ట్ రాసుకుని దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాం. ఇదొక హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా. గేమింగ్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పని చేసే ఒక ఎంప్లాయ్ జీవితంపై విరక్తి చెంది ఒక గేమ్ లో పడితే ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించాం. మధుబాల గారు ఆదిత్య మీనన్ గారు ఇందులో ఉండడం ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కు వెళ్లింది. గేమ్ స్టార్ట్ చేసాం . మా గేమ్ ను ప్రేక్షకులే గెలిపించాలి. ఈ సినిమా తర్వాత మా తమ్ముడైన డైరెక్టర్ దయానంద్ యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంటాడు. నేను కూడా నటుడుగా పేరు తెచ్చుకోవాలని ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను” అని చెప్పారు.
నటుడు కిరిటీ, సినిమాటోగ్రాఫర్ అరవింద్ విశ్వనాథ్, నవాబ్ గ్యాంగ్, అశ్విన్ అరుణ్, మ్యూజిక్ డైరెక్టర్ అభిషేక్ ఏఆర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గీతానంద్, నేహా సోలంకి, ఆదిత్య మీనన్, మధుబాల, వాసంతి, కిరిటీ, శుభలేఖ సుధాకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్ డైరక్టర్; అభిషేక్ ఏ ఆర్; సాంగ్స్ః నవాబ్ గ్యాంగ్, అశ్విన్ – అరుణ్; సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్; స్క్రిప్ట్ సూపర్ వైజర్ : విజయ్ కుమార్ సి.హెచ్ ; ఎడిటర్ : వంశీ అట్లూరి; ఆర్ట్ః విఠల్; యాక్షన్ కొరియోగ్రఫీః రామకృష్ణ. నభా స్టంట్స్; స్టైలింగ్ః దయానంద్; పిఆర్ఓః జి.కె మీడియా; కొరియోగ్రఫిః మోయిన్; నిర్మాత: రవి కస్తూరి; కథ-స్ర్కీన్ ప్లే-డైలాగ్స్-డైరక్షన్: దయానంద్.