“9వ త‌ర‌గ‌తిలోనే ప్ర‌పంచ విప్ల‌వానికి ఐకాన్‌గా నిలిచే చేగువేరా గురించి తెలుసుకున్నాను. అప్ప‌టి నుంచి ఒక‌టే క‌ల. ఆయ‌న బ‌యోపిక్ సినిమాగా తీయాల‌ని. డ‌బ్బులు లేవు, స‌పోర్టు లేదు. తోపుడు బండిపై చిన్నచిన్న తినుబండారాలు అమ్ముతూ పైసా పైసా కూడ‌బెట్టాను. నా అణువ‌ణువూ చేగువేరా. ల‌క్ష్యం, సంక‌ల్పం ఒక్క‌టే. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు చేగువేరాను మ‌ధ్య‌మ‌ధ్య‌లో నాకు ప‌రోక్షంగా గుర్తు చేస్తున్న స‌మ‌యంలో నా లక్ష్యం మ‌రింతా బ‌ల‌ప‌డింది. 20 ఏళ్ల శ్ర‌మ ఫ‌లించింది. ఆయ‌న గౌర‌వం ఏమాత్రం త‌గ్గకుండా చేగువేరా బ‌యోపిక్ “చే” సినిమాను తీశాను. సినిమా ప్ర‌చార చిత్రాల‌ను చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా స్వ‌యంగా విడుద‌ల చేసి మా చిత్ర‌యూనిట్‌ను మ‌మ్మ‌ల్ని అభినందించడం మాకెంతో గ‌ర్వ‌కార‌ణం. సెన్సార్ వాళ్లు కూడా సినిమా చూసి ఇంప్రెస్ అయ్యారు. డిసెంబర్ 15న థియేట‌ర్‌ల‌లోకి చేగువేరా బ‌యోపిక్ “చే”ను విడుద‌ల చేస్తున్నాం..” అని అన్నారు రచయిత, దర్శకుడు: బి.ఆర్ సభావత్ నాయక్.

 

Leave a comment

error: Content is protected !!