మెగా ఫ్యామిలీ నుంచి నటిగా అరంగేట్రం చేసిన ఏకైక అమ్మాయి కొణిదెల నిహారిక. ఈ నాగబాబు గారాల తనయ ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం కావడం.. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో మరికొన్ని సినిమాల్లో నటించడం తెలిసిందే. కానీ ఆమెకు ఎక్కడా అదృష్టం కలిసి రాలేదు. దీంతో నటనకు దాదాపు దూరం అయిపోయింది నిహారిక. ఆ మధ్య ఒక వెబ్ సిరీస్‌లో కనిపించినా.. అక్కడ కూడా స్పందన అంతంతమాత్రమే. దీంతో నిహారిక రూటు మారుస్తోంది. ఆమె నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో ఇప్పటికే ఆమె కొన్ని వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలిమ్స్‌లో భాగస్వామి అయింది. ప్రొడ్యూసర్‌గా కొంచెం కుదురుకుంటే తన అన్నయ్యతో సినిమాలు తీసే ఛాన్సుంది.

Leave a comment

error: Content is protected !!