చిన్న పిల్లలు ఎవరూ ఆకలితో వుండకూదనేది నా లక్ష్యం. ఎంతవరకూ కుదిరితే అంత ఆ దిశగా పని చేయాలి అంటున్నారు రేణు దేశాయ్‌. రవితేజ, గాయత్రి భరధ్వాజ్‌, నుపుర్‌ సనన్‌ మెయిన్‌లీడ్‌తో వంశీ డైరెక్షన్‌లో అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్న మూవీ టైగర్‌ నాగేశ్వరరావు. ఈ చిత్రంలో స్టూవర్ట్‌పురం ప్రాంతంలో దొంగల జీవితాల్ని మార్చిన సామాజికవేత్త హేమలత లవణం గారి పాత్రను పోషిస్తున్నారు నటి రేణుదేశాయ్‌. అక్టోబర్‌ 20 న ఈ చిత్రం రిలీజ్‌ సందర్భంగా విలేకరులతో ఈ సినిమా విశేషాలు పంచుకున్నారు రేణుదేశాయ్‌.

సహజంగా నేను మాట్లాడేటప్పుడు నా తల ఎక్కువగా కదులుతుంది. కానీ హేమలత లవణం గారు చాలా స్థిరంగా హుందాగా ఉంటారు. అలా స్థిరంగా వుండే బాడీ లాంగ్వేజ్ పై వర్క్ చేశాను. హేమలతా లవణం గారి గురించి తెలుకోవడానికి కొంతమందిని కలిశాను. లవణం గారి మేనకోడలు కీర్తిగారిని విజయవాడలో కలిశాను. ఆవిడ గురించి చాలా సమాచారం ఇచ్చారు. ఈ పాత్ర చేసినప్పుడు అవన్నీ సహాయపడ్డాయి, అలాగే తెలుగుని కూడా స్పష్టంగా ప్రిపేర్ అయ్యాను. ఆమెలా కనిపించడానికి చాలా నిజాయితీగా ప్రయత్నించాను. ఈ పాత్ర నాకు చాలా తృప్తిని ఇచ్చింది.

రవితేజ గారితో పని చేయడం చేయడం ఖచ్చితంగా గొప్ప అనుభూతి. రవితేజ గారి గురించి ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో మరింత చెప్తాను. దీని కోసం ప్రత్యేకంగా ఒక స్పీచ్ కూడా ప్రిపేర్ చేశాను.

నాకు ఇంకా నటించేలానే వుంది. కానీ కథ. పాత్ర, దర్శకుడు, నిర్మాత ఇవన్నీ కలసి రావాలి. ఇప్పుడు టైగర్ నాగేశ్వర రావుకి మూడు కలిసొచ్చాయి. మంచి పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తాను. ఈ ట్రైలర్‌ చూసి మా అమ్మాయి వయసుకు తగ్గ పాత్ర చేసావ్‌ అని మెచ్చుకుందన్నారు రేణు దేశాయ్‌.

హీరోయిన్‌గా డిజైనర్‌గా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా జర్నీ గురించి చెప్తూ.. డిజైనర్ విషయంలో మీకో క్లారిటీ ఇవ్వాలి. నేను డిజైనర్ ని కాదు. నేను ఒరిజినల్ స్టయిలిస్ట్ ని. డిజైనర్ వర్క్ వేరు. నాకు కలర్స్ పై మంచి అవగాహన వుంది. నేను ఆర్ట్స్ స్టూడెంట్ ని. ఏ కలర్ ఏది మ్యాచ్ అవుతుందో నాకు అర్ధమౌతుంది. నేను స్టయిలిస్ట్ ని మాత్రమే. స్టయిలింగ్ కూడా నేను ప్లాన్ చేసి చేసింది కాదు. ఖుషి సినిమాకి ముందు కళ్యాణ్ గారితో షాపింగ్ కి వెళ్ళినపుడు నా స్టయిలింగ్ సెన్స్ ఆయనకి నచ్చింది. నువ్వే చేసేయ్ అన్నారు. అలాగే సామాజిక కార్యక్రమాలు, కవిత్వం రాయడం, ఇవన్నీ కూడా ప్లాన్ చేసి చేసినవి కాదన్నారు రేణు దేశాయ్‌. అకిరా గురించి చెప్తూ.. అకిరాకు హీరో అవ్వాలని ఈ క్షణం వరకు లేదు.. పియానో నేర్చుకున్నాడు మ్యూజిక్‌ పై ఇంట్రస్ట్ ఉందన్నారు. తనకు అకిరాను హీరోగా చూడాలని ఉన్నంత మాత్రాన తన ఇష్టానికి వ్యతిరేకంగా ఏం చేయలేం అన్నారు. ముందు ముందు వయసుకు తగ్గ మంచి పాత్రలు వస్తే నటిస్తానన్నారు రేణు దేశాయ్‌.

Leave a comment

error: Content is protected !!