లెజెండరీ క్రికెటర్, శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన బయోపిక్ ‘800’. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. ముత్తయ్య పాత్రలో స్లమ్‌డాగ్ మిలియనీర్ఫేమ్ మధుర్ మిట్టల్, ఆయన భార్య మదిమలర్ పాత్రలో హీరోయిన్ మహిమా నంబియార్ నటించారు. ప్రముఖ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ హిందీ భాషల్లో ఆయన విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో శివలెంక కృష్ణ ప్రసాద్ ముచ్చటించారు.

ఎస్పీ చరణ్ తమిళంలో వర్షంరీమేక్ చేసినప్పుడుఆ సినిమాకు అసిస్టెంట్ దర్శకుడిగా తీసుకున్నా. ఆ సినిమా నిర్మాణ బాధ్యతలు అన్ని నేనే చూశా. ఆ తర్వాత వెంకట్ ప్రభు దగ్గర నాలుగైదు సినిమాలకు దర్శకత్వ శాఖలో శ్రీపతి పని చేశాడు. మా నిర్మాణ సంస్థలోనే దర్శకుడిగా పరిచయం చేయాలని అనుకున్నాం. అయితే ముత్తయ్య మురళీధర్ బయోపిక్ చేసే అవకాశం వచ్చిందని చెబితే సంతోషంగా ఆ సినిమా చేసి రమ్మని నేనే చెప్పానంటూ దర్శకుడు శ్రీపతి గురించి చెప్పారు.

ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి ఎప్పుడు ఏం జరుగుతుందో శ్రీపతి నాకు చెబుతూ వస్తున్నాడు. షూటింగ్ చేయడానికి లండన్ వెళ్లినా, ముత్తయ్య మురళీధరన్ గారి సొంతూరు వెళ్ళినాఎప్పటికప్పుడు నాకు అప్డేట్స్ ఇస్తున్నాడు. అందువల్ల నాకు సినిమా గురించి తెలుసు. అయితేముందు ఒకసారి మురళీధరన్ గారితో మాట్లాడమని చెప్పా. అర గంటకు ఆయన నుంచి నాకు ఫోన్ వచ్చింది. ‘మీ గురించి శ్రీపతి ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. నేను కూడా విన్నాను. మీరు సినిమా విడుదల చేస్తే నాకు సంతోషంఅని మురళీధరన్ గారు చెప్పారు. అలా నేను ఈ సినిమాలోకి ఎంటర్ అయ్యానన్నారు.

బయోపిక్ కదామార్చడానికి ఏం ఉంటుంది? ఉన్నది ఉన్నట్టుగా తీశారు. అలాగని ఇదేదో డాక్యుమెంటరీలా ఉంటుందని అనుకోవద్దు. మురళీధరన్ గారి జీవితంలో కమర్షియల్ హంగులు అన్నీ ఉన్నాయి. ఒక మనిషి జీవితం ఇలా ఉంటుందా? ఎన్ని అవరోధాలు ఎదుర్కొని ఆయన ఈ స్థాయికి చేరుకున్నారా? అని ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా, తెరపై సన్నివేశాలు అలా చూస్తూ ఉండేలా సినిమా ఉంటుందన్నారు.

800 ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సచిన్ టెండూల్కర్ సౌరవ్ గంగూలీ వీవీఎస్ లక్ష్మణ్ అనిల్ కుంబ్లే వంటి దిగ్గజ క్రికెటర్లను కలవడమే ఒక పెద్ద అనుభూతి. ప్రతి ఒక్కరూ చాలా డౌన్ టు ఎర్త్. ఈ జర్నీ మంచి మెమొరబుల్ అన్నారు.

ఈ సినిమాను శ్రీలంకలో రిలీజ్ చేస్తున్నారు. ముత్తయ్య మురళీధరన్ గారి సొంతూరు అది! అక్కడ రిలీజ్ వరకు ఆయనే చూస్తున్నారు. నేను ఇండియా, ఓవర్సీస్ రిలీజ్ విషయాలు చూస్తున్నా. ఈ సినిమాను తమిళంలో తీశారు. తెలుగుతో పాటు హిందీలో విడుదల చేస్తే బాగుంటుందని చెప్పానన్నారు.

 

Leave a comment

error: Content is protected !!