ఆకర్షించే చిరునవ్వు, కళ్ళలోని  స్పార్క్ నెస్ తో, నటించగల బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మ. బాలీవుడ్ లో ప్రవేశించక ముందే అనుష్క శర్మ మోడల్ గా పలు వాణిజ్య ప్రకటనలో నటించింది. ప్రముఖ గ్లామర్ వాణిజ్య సంస్థ అయిన  లాక్మే ఫ్యాషన్ వీక్ లో మోడల్ గా మెరుపులు మెరిపించింది.  తరువాతా నటన పై మక్కువతో సినీరంగ ప్రవేశం చేసి షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్ వంటి టాప్ హీరోస్ తో పాటు షాహిద్ కపూర్, రణబీర్ కపూర్, రన్ వీర్ సింగ్ వంటి యువ హీరోల సరసన నటించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. తర్వాత విరాట్ కోహ్లీ తో ఏర్పడిన ప్రేమతో వివాహం చేసుకుని ఒక పాపకి కూడా జన్మనిచ్చింది అనుష్క శర్మ. నేడు తన 33 పుట్టిన రోజు.

అనుష్క శర్మ తండ్రి కల్నల్ అజయ్ కుమార్ శర్మ భారత సైన్యంలో అధికారిగా పనిచేసేవారు. తల్లి ఆశిమా శర్మ గృహిణి కాగా తన పెద్దన్నయ్య కర్ణేష్ మర్చంట్ నేవీలో పనిచేస్తున్నారు. అనుష్క శర్మ ప్రాథమిక విద్యను సైనిక పాఠశాలలో పూర్తిచేసి బెంగుళూరు లోని మౌంట్ కార్మల్ కళాశాల నుండి ఉన్నత విద్య పూర్తి చేసింది. తర్వాత మోడలింగ్ గ్లామర్ ప్రపంచంలోకి రావల్లన్న మక్కువతో నటన అవకాశాల కోసం ముంబైకి చేరుకుంది అనుష్క.

షారుఖ్ ఖాన్ తో తొలి అవకాశం :

యష్ చోప్రాకు చెందిన యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ అనుష్క శర్మ లోని టాలెంట్ గుర్తించి షారుక్ ఖాన్ హీరోగా చేస్తున్నరబ్ నే బనాదీ జోడీసినిమాతో తొలి అవకాశం ఇచ్చింది. సినిమాలోని తన నటనకు అటు ప్రేక్షకులు ఇటు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అలా యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ  అనుష్క శర్మతో మరో రెండు సినిమాలకి గాను కాంట్రాక్టు చేసుకుంది. అలా రూపొందించిన సినిమాలే షాహిద్ కపూర్బద్మాష్ కంపెనీ‘, రన్ వీర్ తో చేసినబ్యాండ్ బాజా బారాత్సినిమాలు. సల్మాన్ తోసుల్తాన్‘, అమీర్ ఖాన్ తోపి.కేవంటి విజయవంతమైన సినిమాలతో తక్కువ కాలంలోనే బాలీవుడ్ ఖాన్ త్రయంతో నటించిన హెరాయిన్ గా ఎదిగింది. షారుక్ తో  జబ్ తక్ హై జాన్‘, ‘జబ్ హ్యారీ మెట్ సెజల్సినిమాలతో పాటు షారుఖ్ సొంత ప్రొడక్షన్ సంస్థరెడ్ చిల్లీస్పై తెరకెక్కినజీరోసినిమాలో సల్మాన్ తో సహా నటించింది. కానీ సినిమా ఆశించిన విజయం పొందలేకపోయింది. మధ్యలో కూడా లేడీస్ వర్సెస్ విక్కీ బెహల్, మట్రూకీ బిజిలీకా మండోలా లాంటి సినిమాలతో తన ప్రతిభ నిరూపించుకుంది.

అవార్డ్స్ :

రబ్ నే బనాదీ జోడీ‘, ‘బ్యాండ్ బాజా బారాత్‘, ‘జబ్ తక్ హై జాన్వంటి సినిమాలకు ఉత్తమ నటిగా మూడు సార్లుఫిలింఫేర్అనుష్క శర్మ అందుకుంది.

Leave a comment

error: Content is protected !!