ఎలాంటి సినిమాకయినా.. దర్శకుడు ప్రారంభంలో అనుకున్న పాత్రలు .. తెరమీదకు వచ్చేసరికి మారిపోతుంటాయి. దానికి ఎన్నో కారణాలుంటాయి. ఆర్టిస్టుల కాల్షీట్స్ దొరక్కపోవడమో, లేక పారితోషికం దగ్గర తేడాలు రావడమో.. లాంటివి జరుగుతుంటాయి. దాని వల్ల ఒకోసారి కొందరు నటులు మంచి పాత్రలు మిస్ అవ్వొచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సంజయ్ దత్. ఆయన కోల్పోయిన అద్భుతమైన పాత్ర ఏంటో తెలుసా? బాహుబలిలోని కట్టప్ప. అవునండీ..నిజమే… రాజమౌళి కట్టప్ప పాత్ర కోసం ముందుగా సంజయ్ దత్ ను ఎంపికచేసుకున్నాడట. అయితే అప్పటికి సంజూ..జైల్లో ఉన్నాడట. అందుకే ఆ పాత్ర కు సత్యరాజ్ ను ఎంపికచేశాడు జక్కన్న. అలాగే.. ఇందులో శివగామి పాత్రకు ముందుగా శ్రీదేవిని, దేవసేన పాత్రకు నయనతారను అనుకున్నారట. కానీ వారి స్థానంలో.. రమ్యకృష్ణ, అనుష్క వచ్చారు. ఒకవేళ వారే గానీ ఆ పాత్రల్ని చేసుంటే.. బాహుబలి రేంజ్ ఇంకెలా ఉండేదో ..