Shopping Cart 0 items - $0.00 0

రహస్యగూఢచారిగా మహేశ్?

సరిలేరు నీకెవ్వరు’ సినిమా గ్రాండ్ సక్సెస్ హ్యాంగోవర్ లో ఉన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. నెక్స్ట్ మూవీ వంశీ పైడిపల్లితో చేయబోతున్నాడన్నసంగతి తెలిసిందే. ‘మహర్షి’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన ఆ దర్శకుడితో మహేశ్ మరోసారి వర్క్ చేయనుండడం ఆసక్తికరంగా మారింది. వంశీ ఈ సారి మహేశ్ బాబు కు ఏ తరహా పాత్రను డిజైన్ చేయబోతున్నాడనే ఆత్రుత కూడా ఉంది.

విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ఈ  సినిమాలో మహేష్ ‘స్పై’ గా నటించనున్నాడట. స్పై అనగానే అందరికీ మురుగదాస్ మహేశ్ తో తీసిన  ‘స్పైడర్’ గుర్తుకొస్తుంది. ఆ మూవీ అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే.   అయితే ఆ సినిమా పేరుకే ‘స్పైడర్’ కానీ..  అందులో మహేశ్ బాబు అసలు గూఢచారే కాదు . అందులో అతడి పాత్ర ఏంటో కూడా క్లారిటీనే లేదు. కాబట్టి.. మహేశ్ బాబు స్పైగా నటించబోయే మొట్టమొదటి మూవీ వంశీ పైడిపల్లితో చేయబోయేదే అని ఫిక్సయిపోవచ్చు. థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో , గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లేతో .. ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ సినిమా ఉండబోతోందని వినికిడి. తమన్ సంగీతం అందించనున్న ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనుంది.  మరి రహస్యగూఢచారిగా మహేశ్ తన తండ్రిని మరిపిస్తాడేమో చూడాలి.  

Leave a comment

error: Content is protected !!