Shopping Cart 0 items - $0.00 0

పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో ‘లాయర్ సాబ్’ ఎంట్రీ

 

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో యాక్టివ్ గా లేక.. టాలీవుడ్ బాక్సాఫీస్ బోసి పోయింది.  2018 లో వచ్చిన ‘అజ్నాతవాసి’  తర్వాత మళ్లీ ఇంతవరకూ పవన్ ముఖానికి మేకపే వేసుకోలేదు. రాజకీయాల్లో ఫుల్ బిజీ కావడం వల్ల ఆయన ఇంతవరకూ  సినిమాల మీద దృష్టే పెట్టలేదు.  అయితే ఇప్పుడు కోట్లాది మంది  పవర్ స్టార్ అభిమానులు సంబరాలు చేసుకొనే సమయం ఆసన్నమైంది. కొంత కాలం నుంచి ఆయన కొత్త సినిమా మీద ఎన్నో వార్తలొస్తున్నాయి. కానీ అవేమీ నిజం కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం బాలీవుడ్ చిత్రం ‘పింక్’ రీమేక్ పవర్ స్టార్ తో తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, ఆ మేరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయినట్టు  పక్కా అప్డేట్ వచ్చింది.  

బాలీవుడ్ లో అమితాబ్ ప్రధాన పాత్రలో తాప్సీ కథానాయికగా వచ్చిన ‘పింక్’ చిత్రం ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో తెలిసిందే. అదే సినిమాను అజిత్ తో తమిళంలో హెచ్. వినోద్ ‘నేర్కొండ పార్వై’ గా తెరకెక్కించగా.. అక్కడా  సూపర్ హిట్టు అయింది. అందుకే ఈ సినిమాను పవన్ కళ్యాణ్ తో నిర్మించేందుకు దిల్ రాజు రంగంలోకి దిగాడు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో అదిరిపోయే ఒక యాక్షన్ సీక్వెన్స్ తో ఈ నెల 20 నుంచి అంటే రేపటి నుంచే  సినిమా సెట్స్ మీదకు వెళ్ళనున్నట్టు సమాచారం. ఇక ఈ మూవీ కోసం ‘లాయర్ సాబ్’ అనే అదిరిపోయే టైటిల్ రిజిస్టర్ చేసినట్టు సమాచారం.  పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటించడం ఇదే మొదటి సారిగా కావడంతో.. ఈ మూవీపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. మరి ‘లాయర్ సాబ్ గా పవర్ స్టార్ .. ఎంత పవర్ ఫుల్ గా వాదిస్తాడో చూడాలి.

Leave a comment

error: Content is protected !!