మన్మథుడు లాంటి రూపు, ఆకర్షించే చూపు, కండలు తిరిగిన ఒళ్ళు, అమ్మాయిల్ని మత్తెక్కించే నీలికళ్ళు .. ఒకే హీరోలో ఉంటే అతడే హృతిక్ రోషన్. బాలీవుడ్ యువ హృదయాల్లో అతడు ఎప్పుడూ సూపర్ హీరోనే. అంతేకాదు బాలీవుడ్ తెరకు మతిపోగొట్టే వెరైటీ స్టెప్స్ నేర్పిన అద్భుత డ్యాన్సర్ కూడా. వెటరన్ బాలీవుడ్ హీరో రాకేశ్ రోషన్ నటవారసుడిగా చిన్ననాడే బాలనటుడిగా తెరకు పరిచయమయ్యాడు  అతడు . ‘కహోనా ప్యార్ హై’ మూవీ తో బాలీవుడ్ తెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతడు తొలి చిత్రంతోనే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశాడు. క్రిష్, ధూమ్ 2 లాంటి సినిమాలతో వసూళ్ళలో దుమ్మురేపి.. తన స్టామినా ఏంటో తెలియచెప్పాడు. ఎన్నో చిత్రాలతో తనలోని యాక్షన్ హీరోని, అద్భుతమైన నటుడ్ని వెలికి తీసి.. ప్రస్తుత యంగ్ హీరోలకు ఒక ఎగ్జాంపుల్ గా నిలిచాడు. రీసెంట్ గా ‘వార్’ చిత్రంతో ఘన విజయం సాధించిన హృతిక్ రోషన్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆ యాక్షన్ హీరో కు బర్త్ డే విషెస్ తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!