Shopping Cart 0 items - $0.00 0

సోగ్గాడి గా రౌడీ హీరో మెప్పిస్తాడా?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అలనాటి అందాల హీరోయిన్ జయలలిత జీవిత కథ ఆధారంగా తమిళంలో ‘తలైవి’ అనే మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ జయలలితగా నటిస్తోంది. అమలాపాల్ మాజీ భర్త, దర్శకుడు ఏ.ఎల్ . విజయ్ ఈ సినిమాకి దర్శకుడు. విబ్రీ మీడియా, కర్ణ మీడియా బ్యానర్స్ పై విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తమిళ ప్రజలు దేవుడిలా కొలిచే మాజీ ముఖ్యమంత్రి యం.జీ.ఆర్ జయంతిని పురస్కరించుకొని నిన్న ఆయన పాత్రలో జీవించిన  అరవింద్ స్వామి లుక్ ను , అభినయించిన ఒక వీడియోను రివీల్ చేశారు. దానికి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ఇంకా.. కరుణానిధిగా ప్రకాశ్ రాజ్, జయలలిత నెచ్చెలి శశికళ గా ప్రియమణి నటిస్తున్నారు. ఇక ఇందులో శోభన్ బాబు పాత్ర కూడా ఉంది. జయలలితకు, ఆయనకు ఉన్న సన్నిహిత సంబంధం బహిరంగ రహస్యం. అలాంటి అందగాడి పాత్ర చేసే అవకాశం మన రౌడీ హీరో విజయ్ దేవరకొండకు  దక్కడం విశేషం.  త్వరలోనే ఈ పాత్రకు సంబంధించిన లుక్ ను కూడా రివీల్ చేస్తారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడిగా, ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ కు కేరాఫ్ అడ్రస్ గా ఒకప్పటి మహిళా ప్రేక్షకుల్ని థియేటర్స్ కు రప్పించిన రొమాంటిక్ హీరో శోభన్ బాబు పాత్రకు .. ఇప్పటి యువతరానికి క్రేజీ హీరో, రొమాంటిక్ హీరో అయిన విజయ్ దేవరకొండ ఎంత వరకూ న్యాయం చేయగలడన్నది ఆసక్తికరంగా మారింది. మరి  మన రౌడీ హీరో..  సోగ్గాడిని ఎలా మరిపిస్తాడో  చూడాలి.

Leave a comment

error: Content is protected !!