Shopping Cart 0 items - $0.00 0

‘సీటీమార్’ కొట్టనున్న గోపీచంద్

యాక్షన్ హీరో గోపీచంద్ టాలీవుడ్ లో సరైన విజయం సాధించి చాలా రోజులైపోయింది. ఏ సినిమా చేసినా.. అదృష్ణదేవత కనికరించడం లేదు. వరుస పరాజయాలు అతడి కెరీర్ గ్రాఫ్ ను కిందికి దించేశాయి. తెలుగు దర్శకులతో పనిజరగడంలేదని తమిళ డైరెక్టర్ తిరుతో ‘చాణక్య’ మూవీ చేశాడు. అయినా లాభం లేకపోయింది. ఇక  గోపీ ఇప్పుడు మళ్ళీ సంపత్ నంది దర్శకత్వంలోనే మరో సినిమాకు కమిట్ అవుతున్నాడు. ఎర్లియర్ గా వీరిద్దరి కలయికలో  ‘గౌతమ్ నందా’ అనే సినిమా తెరకెక్కింది. కానీ అంతగా వర్కవుట్ కాలేదు.  

రామ్ చరణ్ ‘రచ్చ’ తర్వాత సంపత్ నంది  ఆ స్థాయిలో మళ్ళీ హిట్టు కొట్టలేకపోయాడు. ‘లౌక్యం’ తర్వాత గోపీచందూ అంత పెద్ద సక్సెస్ మళ్ళీ సాధించలేకపోయాడు. అందుకే వీరిద్దరూ కసిగా  ఓ పెద్ద సక్సెస్ కోసం మళ్ళీ చేతులు కలుపుతున్నారట. అయితే ఇదో స్పోర్ట్ డ్రామా అంటున్నారు. ఒక కబడ్డీ జట్టుకు కోచ్ గా గోపీచంద్ నటిస్తున్నాడట. అలాగే.. మరో జట్టు కు కోచ్ గా తమన్నా కనిపిస్తుందని టాక్.  ఈ ఇద్దరి మీదా వచ్చేసీన్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించే రీతిలో ఉంటాయట. అందుకే ఈ సినిమాకి ‘సీటీమార్’ అనే అదిరిపోయే మాస్ టైటిల్ ను ఫిక్స్ చేశారు.  గతంలో ‘గోలీమార్’ టైటిల్ తో గోల గోల చేసిన గోపీచంద్ .. ఇప్పుడు ‘సీటీమార్’ తో రచ్చ రచ్చ చేయబోతున్నాడన్నమాట.

Leave a comment

error: Content is protected !!