తొలి సినిమాతోనే సంచలనం సృష్టించిన నటుల కృషి వెనుక చాలా పెద్ద కథ ఉంటుంది. మొట్టమొదటి అవకాశాన్ని అందుకున్నప్పటికీ.. ఆ సినిమాలోని తమ పాత్ర అద్భుతాలు సృష్టించాలంటే… ఎంత కష్టపడి ఉంటారో మనం ఊహించవచ్చు. ఇలాంటి అనుభవమే షోలో లో గబ్బర్ సింగ పాత్రధారి అంజాద్ ఖాన్ కి ఎదురైంది. తొలి సినిమాలోని తొలి షాట్ లో సరిగ్గా చేయకపోతే… ఆ పాత్రను వేరే వాళ్ళు ఎగరేసుకుపోయే పరిస్థితి అది. అలాంటి స్థితిలో ఉన్న ఆయన … సంచలనం రేపడం మామూలు విషయం కాదుకదా.

నిజానికి గబ్బర్ సింగ్ పాత్రకు మొదట అను‌కు‌న్నది డానీని.‌ ఏకంగా ఎని‌మిది నెలల వరస కాల్షీట్లు కావా‌లని దర్శకుడు రమేష్‌ సిప్పీ చెప్పడంతో, ఫిరో‌జ్‌ఖాన్‌ నిర్మి‌స్తున్న ‌‘ధర్మాత్మా’‌ సిని‌మాకు సమయం కెటా‌యిం‌చా‌నని డానీ తప్పు‌కు‌న్నాడు.‌ అయితే కొత్త విల‌న్‌ను తెరకు పరి‌చయం చేస్తే కొత్తదనం ఉంటుం‌దని సలీం ఉద్దేశ్యం.‌ స్క్రీన్‌ టెస్ట్ కు ముందే అమ్జా‌ద్‌ఖాన్‌ చేత కొంచెం గెడ్డం పెంచి, ముని‌పళ్ల మీద కాస్త ఎర్రటి గారతో, మిల‌టరీ వాళ్లు వేసు‌కునే ఆలీవ్‌ కలర్ డ్రెస్  వేసు‌కొని వచ్చేలా చేశాడట  సలీం.‌ దాంతో…  అమ్జా‌ద్‌ఖాన్‌ రమేష్‌ సిప్పీకి నచ్చాడు.‌ అప్పుడు పాత్ర లక్షణా‌లను వివ‌రించి ‌‘అభి‌శప్త చంబల్‌’‌ అనే నవ‌లను చదివి, చంబల్‌ లోయలో దోపిడీ దొంగలు ఎలా ప్రవ‌ర్తి‌స్తారో ఆక‌ళింపు చేసు‌కో‌మని చెప్పి, గబ్బ‌ర్ సింగ్‌ పాత్రకు ఒక వినూత్న రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారట సలీం.‌ షూటింగ్‌ తొలి‌రోజు అమ్జా‌ద్‌ఖాన్‌ ‌‘సువ్వర్‌ కే బచ్చే , కితనే ఆద్మీ థే’‌ అనే చిన్న డైలా‌గును బండ‌రాళ్ల మీద నడుస్తూ చెప్పాలి.‌ ఫిలిం తిరు‌గు‌తోంది.‌ అప్పటికే నల‌భైకి పైగా టేకులు అయ్యాయి.‌ కానీ ఒక్కటి కూడా సంతృ‌ప్తిగా రాలేదట.‌ మరు‌సటి రోజుకి ప్యాకప్‌ చెప్పారు.‌ రెండవ రోజు కూడా అమ్జా‌ద్‌ఖాన్‌ పరి‌స్థితి అదే. మరలా ప్యాకప్‌ చెప్పారు.‌ అప్పుడు సలీం−‌జావే‌ద్‌లు రమేష్‌ సిప్పీతో ‌‘మా అంచనా తప్పయింది.‌ అతన్ని మార్చా‌ల‌ను‌కుంటే మార్చే‌యండి అని చెప్పే‌శారట.‌ విషయం తెలి‌సిన అమ్జా‌ద్‌ఖాన్‌ పట్టు‌ద‌లతో గట్టిగా ప్రాక్టీస్  చేసి మూడ‌వ‌రోజు షూటిం‌గ్‌లో తొలి టేక్‌నే ఓకే చేయిం‌చాడు.‌ ఇక అమ్జాద్‌ వెనక్కు చూసు‌కో‌లేదు.‌ రమేష్‌ సిప్పీ అమ్జా‌ద్‌ఖాన్‌ పేరును గాని, స్టిల్‌ను గాని బయ‌టకు రాకుండా జాగ్రత్తపడి, ఒకే‌సారి సినిమా విడు‌దల రోజున అతని పేరును ప్రక‌టించి ప్రేక్షకు‌లను పెద్దషాకిచ్చారు దర్శకుడు సిప్పీ.

 

Leave a comment

error: Content is protected !!