Shopping Cart 0 items - $0.00 0

వెంకీ ‘నారప్ప’ ఫస్ట్ లుక్ వచ్చేసింది

 

ధనుష్ నటించిన తమిళ సూపర్ హిట్టు మూవీ  ‘అసురన్’ ను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది.  గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథకు ఒక తండ్రి తన బిడ్డలకోసం పడ్డ తపన, అతడి ప్రతికారం ప్రధాన బలం . అలాంటి కథతో వస్తోన్న ‘అసురన్’  తెలుగు వెర్షన్ కు ‘నారప్ప’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఆ మేరకు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.  

‘నారప్ప’ గెటప్ లో వెంకీ లుక్ చాలా ఇంటెన్స్ గా ఉంది. ‘అసురన్’ లోని  ధనుష్ గెటప్ నే యాజిటీజ్ గా వెంకీకి వేశారు అనిపిస్తోంది. వెంకీ నెరిసిన గెడ్డంతో  తలపాగా చుట్టుకొని రౌద్రంగా చూస్తోన్న ఆ లుక్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ఇక ఫష్ట్ లుక్ పోస్టర్ పై షూటింగ్ బిగిన్స్ అని కూడా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో కథానాయికగా ప్రియమణి నటించనుంది. తమిళంలో మంజువారియర్ చేసిన పాత్రనే ఆమె చేయబోతోంది. మరి ‘నారప్ప’గా వెంకీ ఎలా మెప్పిస్తాడో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!