Shopping Cart 0 items - $0.00 0

వరుణ్ తేజ ‘బాక్సర్’ ఫ్యాన్ మేడ్ పోస్టర్ అదరహో

 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ లాస్టియర్ ‘ఎఫ్ 2, గద్దల కొండ గణేశ్’మూవీస్ తో  వరుసగా సూపర్ హిట్ కొట్టడంతో  స్టార్ స్టాటస్ లోకి వచ్చేశాడు. ఈ ఏడాది అతడు నటించే మూవీస్ మీద అభిమానుల్లో మరింత ఆసక్తి ఏర్పడింది.  కొత్తదనం నిండిన కథలకు పెద్ద పీట వేయాలని మనోడు నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలోనే  ఒక బాక్సింగ్ డ్రామాను తన తదుపరి చిత్రంగా ఎంపిక చేసుకున్నాడు వరుణ్ .  కిరణ్ కొర్రపాటి అనే కొత్త కుర్రోడు చెప్పిన ఒక స్టన్నింగ్ స్టోరీకి ఫిదా అయిన వరుణ్ తేజ.. ఆ సినిమా మేకోవర్ పై ప్రత్యేక శ్రద్ధపెట్టి , బాక్సింగ్ ప్రాక్టీస్ ను కూడా ఓ రేంజ్ లో చేశాడు.  ఈ రోజు వరుణ్ తేజ పుట్టిన  రోజు సందర్భంగా ‘బాక్సర్’ టైటిల్ తో ఉన్న ఫస్ట్ లుక్ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ను వరుణ్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో రిలీజ్ చేశారు. వరుణ్ సీరియస్ గా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తోన్న ఆ లుక్ భలేగా అనిపిస్తోంది.

రినైసెన్స్ పిక్చర్స్ బ్యానర్ పై అల్లు వెంకటేశ్, సిద్ధు ముద్ద సంయుక్తంగా అల్లు అరవింద్ సమర్పణలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా స్టంట్ కొరియో గ్రాఫర్ గా హాలీవుడ్ నుంచి లార్నెల్ స్టోవెల్ ను రంగంలోకి దింపారు. ప్రస్తుతం లార్నెల్ ‘కెప్టెన్ అమెరికా’ సిరీస్ లోని తర్వాత మూవీకి వర్క్ చేస్తున్నాడు. బాక్సర్ గా మెగాభిమానుల్ని అలరించే గెటప్ లో వరుణ్ తేజ ఫస్ట్ లుక్  రివీల్ అయింది. అయితే  ఆ సినిమాకి అదే టైటిల్ పెడతారా ?   ‘బాక్సర్’ ఫస్ట్ లుక్ పోస్టర్  అఫీషియల్ గా ఎప్పుడు విడుదల చేస్తారు? అనే విషయాలు త్వరలో తెలుస్తాయి. 

 

 

 

 

 

Leave a comment

error: Content is protected !!