Shopping Cart 0 items - $0.00 0

వచ్చే సంక్రాంతికి యన్టీఆర్ తో వస్తాడట

‘అజ్నాతవాసి’ రిజల్ట్ త్రివిక్రమ్ కెరీర్ ను ప్రశ్నార్ధకంలో పడేసింది.  కానీ  గురూజీ ‘అరవింద సమేత’ మూవీతో కాస్తంత గాడిలో పడి,   ఈ ఏడాది సంక్రాంతికి ‘అల వైకుంఠపురములో’ బ్లాక్ బస్టర్ తో పూర్తి స్థాయిలో ఫామ్ లోకి వచ్చేశాడు. ఆయన తదుపరి చిత్రంపైనే ఇప్పుడు అందరి ఆసక్తి. నిజానికి ‘అరవింద సమేత’ తర్వాత త్రివిక్రమ్ .. యన్టీఆర్ తో మరో సినిమా చేయాలని అనుకున్నాడు. ఆయన చెప్పిన స్టోరీ లైన్ నచ్చి.. యన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎట్టకేలకు ఇప్పుడా సమయం ఆసన్నమైందని టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు. త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ తారక్ తోనే ఫిక్స్ అంటున్నారు.

యన్టీఆర్ తో చేయబోయే మూవీకి పూర్తి స్ర్కిప్ట్ ను ఏప్రిల్ కల్లా రెడీ చేసి.. వెంటనే పట్టాలెక్కించాలన్నది త్రివిక్రమ్ ఆలోచనట. అంతేకాదండోయ్ .. వచ్చే సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారట. కథలో యాక్షన్ పాళ్ళు తక్కువగానూ, వినోదం పాళ్లు ఎక్కువగానూ ఉంటుందని  తెలుస్తోంది. ఒక విధంగా జంధ్యాల మార్కు కామెడీని గుర్తు చేసేలా కథ ఉంటుందని వినికిడి.  ఈ నెలలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందట. మరి ఈ సారి మాటల మాంత్రికుడు యన్టీఆర్ కు ఏ స్థాయిలో విజయాన్ని అందిస్తాడో చూడాలి.  

Leave a comment

error: Content is protected !!