Shopping Cart 0 items - $0.00 0

మోస్ట్ వాంటెడ్ ఇన్ టాలీవుడ్

తమిళ హీరో విజయ్ సేతుపతి టాలెంట్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వైవిధ్యమైన పాత్రల్ని ఎంపికచేసుకోవడంలోనూ, వెరైటీ కథాంశాలను వెతికి పట్టుకోవడంలోనూ మనోడు చాలా దిట్ట. సహజమైన నటనతో.. వెరైటీ బాడీ లాంగ్వేజ్ తో అతడు నటించే తీరుకే అందరూ ఫిదా అయిపోతారు.  అలాంటి నటుడికి భాషతో సంబంధం ఏముంటుంది? అందుకే  కేవలం కోలీవుడ్ కే తన టాలెంట్  ను పరిమితం చేయకుండా .. ఇతర భాషల్లోనూ సత్తా చాటలని ఉవ్విళ్ళూరుతున్నాడు. అందులో భాగంగానే తొలుత మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ చిత్రంలో రాజపాండి అనే తమిళియన్ పాత్ర పోషించి మెప్పించాడు. ఇప్పుడు మరిన్ని చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే పనిలో ఉన్నాడు.

దానికి తగ్గట్టుగానే  టాలీవుడ్ దర్శకులు విజయ్ సేతుపతిని  విలన్ గా చూపించడానికి తెగ పోటీ పడిపోతున్నారు. ముందుగా మెగా ఫ్యామిలీ వారసుడు  వైష్ణవ్ తేజ (సాయిధర్మతేజ తమ్ముడు) హీరోగా నటిస్తోన్న ‘ఉప్పెన’ చిత్రంలో విజయ్ సేతుపతి  విలన్ గా తొలిసారిగా  ఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే అల్లు అర్జున్, సుకుమార్ మూవీలో కూడా విజయ్ సేతుపతే విలన్ అంటున్నారు. ఇంకా వరుణ్ తేజ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న స్పోర్ట్ మూవీ ‘బాక్సర్’ లో కూడా విలన్ గా విజయ్ సేతుపతి పేరునే పరిశీలిస్తున్నారట. అలాగే మరికొన్ని తెలుగు చిత్రాలకు కూడా  విజయ్ సేతుపతి కమిట్ అవుతున్నాడని సమాచారం. ఇక మనోడు కొన్ని బాలీవుడ్ మూవీస్ లో కూడా ముఖ్యపాత్రలు పోషిస్తున్నాడు. మొత్తానికి విజయ్ సేతుపతి టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ అయిపోయాడు. మరి ఆ మూవీస్ అతడికి ఏ స్థాయిలో పేరు తెచ్చిపెడతాయో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!