Shopping Cart 0 items - $0.00 0

మార్చ్ లో సెట్స్ మీదకు ‘బంగార్రాజు’

‘మన్మథుడు 2’ తర్వాత అక్కినేని నాగార్జున ‘వైల్డ్ డాగ్’ అనే మూవీకి కమిట్ అయ్యాడు.  మొన్నామధ్య ఈ సినిమా  అనౌన్స్ మెంట్ జరిగింది. ఏసీపి విజయ వర్మ అనే ఒక ఎన్.ఏ.ఐ ఆఫీసర్ జీవిత కథగా తెరకెక్కనున్నఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనుంది. మరో పక్క  ‘బ్రహ్మాస్త్ర’ బాలీవుడ్ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ రెండూ కాకుండా నాగ్ మరో కొత్త సినిమాకు ఇంతవరకూ కమిట్ కాలేదు. ‘ఊపిరి’ తర్వాత సరైన స్థాయిలో మరో సక్సెస్ దక్కకపోవడంతో .. నాగ్ ప్రస్తుతం కొత్త కథలను ఫిల్టర్ చేసే కార్యక్రమంలోఉన్నాడు. పనిలో పనిగా.. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సీక్వెల్ ‘బంగార్రాజు’ ని త్వరలోనే పట్టాలెక్కించాల నుకుంటున్నాడు.  

మొన్నటివరకూ నాగార్జునకు వేరే పనిలో బిజీగా ఉండడం , దర్శకుడు కళ్యాణ్ కృష్ణకు వ్యక్తిగత పనులుండడం వల్ల ఈ ప్రాజెక్ట్ లేటయింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ముందుకు కదిలినట్టు సమాచారం. కథపై కసరత్తు పూర్తి చేసిన కళ్యాణ్ కృష్ణ .. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తో  మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలు పెట్టాడట.   మార్చ్ 3వ వారంలో ‘బంగార్రాజు’ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందట. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫిల్మ్ నగర్ టాక్. నాగ్, రమ్యకృష్ణల పాత్రలతో పాటు .. ఇందులో నాగచైతన్య కూడా మరో ప్రత్యేకపాత్రలో నటించనున్నాడు.  మరి ‘బంగార్రాజు’ సోగ్గాడు ను మరిపిస్తాడేమో చూడాలి.   

Leave a comment

error: Content is protected !!