మెగా ప్రిన్స్ వరుణ్ తేజ .. వరుస విజయాలతో హుషారుగా ఉన్నాడు. ఆ ఉత్సాహంతోనే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ను లైన్ అప్  చేసుకుంటున్నాడు. ప్రస్తుతం మనోడు నటిస్తోన్న స్పోర్ట్స్ డ్రామా ‘బాక్సర్’ .  కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించిన ఒక తాజా అప్డేట్ అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.  ఇందులో వరుణ్ తేజ తల్లిగా నదియా నటించబోతోందట. అయితే ముందుగా అదే పాత్రకోసం రమ్యకృష్ణను సంప్రదించారు మేకర్స్. మరి కారణాలేంటో తెలియదు కానీ.. ఆమె ను ఇప్పుడు నదియా రీప్లేస్ చేస్తున్నట్టు సమాచారం.

‘అత్తారింటికి దారేది’ సూపర్ హిట్టు చిత్రంలో బాబాయ్ పవర్ స్టార్ కు అత్తగా నటించి .. తెలుగు వారి అభిమాన నటిమణి అయిపోయిన .. నదియా .. ఇప్పుడు అబ్బాయికి అమ్మగా నటించనుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఒక కీలకమైన పాత్రలోనే నదియా కనిపించనుందని తెలుస్తోంది. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ లార్నెల్ స్టావెల్ స్టంట్స్ కొరియో గ్రఫీ అందిస్తోన్న బాక్సర్ వరుణ్ తేజకు ఏ రేంజ్ లో క్రేజ్ తెస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!