Shopping Cart 0 items - $0.00 0

ఫస్ట్ సింగిల్ తో ‘ఫేమస్ లవర్’ వచ్చేస్తున్నాడు

 

‘డియర్ కామ్రేడ్’ మూవీతో లాస్టియర్ ఫ్యాన్స్ ను కాస్తంత నిరాశ పరిచిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. తదుపరి చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తో ఆ లోటు పూర్తిగా తీర్చేయాలను కుంటున్నాడు. దానికి తగ్గట్టుగానే ఆ మూవీకి తన స్టైల్లో ప్రచారం మొదలు పెట్టేశాడు. టీజర్ తో ఈ సినిమా ఎలా ఉండబోతోందో జనానికి ఆల్రెడీ హింటిచ్చేశాడు విజయ్. ‘అర్జున్ రెడ్డి’ స్టైల్లో సాగే అగ్రెసివ్ కేరక్టర్ తో .. మరోసారి భగ్న ప్రేమికుడిగా ఈ మూవీలో అదరగొట్టబోతున్నానని చాలా క్లియర్ గా చెప్పాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ వేలెంటైన్స్ డే కానుకగా విడుదల కానుంది.  అందుకే ఇప్పటి నుంచీ ఈ సినిమా ప్రచారాలు మొదలు పెట్టేశారు. అందులో భాగంగానే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ లోని ఫస్ట్ సింగిల్ వదలనుంది మూవీ టీమ్.

ఈ నెల 20న ‘వరల్డ్ ఫేమస్’ లవర్ చిత్రంలోని ‘మై లవ్’ అనే పాటను ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్టు విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. అందాల రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా కు గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ‘మళ్ళీ మళ్ళీ రాని రోజు’ లాంటి  ఫీల్ గుడ్ లవ్ స్టోరీని అందించి .. అందరినీ టచ్ చేసిన క్రాంతి మాధవ్ ఈ మూవీతో కూడా అదే మ్యాజిక్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఈ మూవీ విజయ్ కు ఏ రేంజ్ లో క్రేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.

 

  

Leave a comment

error: Content is protected !!