రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి తెలుగు తెరకు కమ్ బ్యాక్ అయ్యాడు. ఒకేసారి ఏకంగా ‘వకీల్ సాబ్’ , క్రిష్ దర్శకత్వంలోని మూవీని ట్రాక్ ఎక్కించాడు. మరో సినిమాను లైన్ లో పెట్టుకున్నాడు. విషయానికొస్తే.. క్రిష్ తెరకెక్కిస్తోన్న పీరియాడికల్ మూవీ లో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహాలోని ఒక డైనమిక్  పాత్ర చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఉన్నవారిని కొట్టి.. లేనివారికి పెట్టు అనే సిద్ధాంతంతో స్వాతంత్ర్యానికి పూర్వం… బ్రిటీష్ అధికారుల్ని గడగడలాడించిన ఒక విప్లవవీరుడి పాత్ర అని తెలుస్తోంది. అయితే అందులో పవన్ కళ్యాణ్ లుక్ ఎలా ఉండాలో క్రిష్ చాలా రకాల స్కెచెస్ గీయించి పెట్టుకున్నాడట. అందులో ఆయన సెలెక్ట్ చేసిన లుక్ ఇదని .. సోషల్ మీడియాలో ఒక ఫ్యాన్ మేడ్ లుక్  వైరల్ గా మారింది.

మెలితిరిగిన మీసాలతో రాజసం ఉట్టిపడుతోన్న సీరియస్ లుక్ తో పవన్ కళ్యాణ్  పోస్టర్ అభిమానుల్ని భలేగా ఖుషీ చేస్తోంది.  పవన్ నట కెరీర్ లోనే మొట్టమొదటి సారిగా నటిస్తోన్న ప్రీ ఇండిపెండెంట్ నేపథ్యంలోని మూవీ చేస్తూండడంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. అంతేకాదు దర్శకుడు క్రిష్ కి కంచె, గౌతమీ పుత్ర శాతకర్ణి , యన్టీఆర్ లాంటి పీరియాడికల్ మూవీస్ చేసిన అనుభవం ఉంది. దాంతో పవర్ స్టార్ రాబిన్ హుడ్ లాంటి పాత్రను ఏ రేంజ్ లో చేస్తాడో అనే ఆసక్తి రేగుతోంది.  ఫ్యాన్ మేడ్ పోస్టరే అంతవైరల్ అయితే.. దీనికి సంబంధించిన ఒరిజినల్ లుక్ ఎలా ఉంటుందో చూద్దాం.

Leave a comment

error: Content is protected !!