Shopping Cart 0 items - $0.00 0

పూరీ – విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ ప్రారంభం

టాలీవుడ్ నయా సంచలనం విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ పై అందరికీ చాలా ఆసక్తిగా ఉంది.  ఆ మూవీ  ప్రకటన వచ్చి  చాలా రోజులు అయిపోతున్నా.. ఇంతవరకూ లాంచింగే అవలేదు. ఎట్టకేలకు ఈ రోజు ముంబై లో ఈ మూవీ ప్రారంభోత్సవం చాలా గ్రాండ్ గా జరిగింది. రీసెంట్ గా ‘ఇస్మార్ట్ శంకర్’ తో బ్లాక్ బస్టర్ కొట్టిన పూరీ, టాలీవుడ్ రౌడీ హరో విజయ్ కలయికలో రానున్న  తొలి చిత్రం కాబట్టి.. సినిమా మీద హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పూరీ స్టైలాఫ్ హీరో కేరక్టరైజేషన్ లో ‘అర్జున్ రెడ్డి’ పరకాయ ప్రేవేశం చేస్తే ఎలా ఉంటుందో చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు. అలాంటి రేర్ కాంబో మూవీకి ‘ఫైటర్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ఎప్పటినుంచో ప్రచారం లో ఉంది.

నేటి నుంచే ‘ఫైటర్’ రెగ్యులర్ షూటింగ్ కు కూడా వెళ్ళనున్నట్టు .. అలాగే.. తొలి షెడ్యూల్ ను ముంబై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. సినిమాలు చాలా ఫాస్ట్ గా తీయడంలో మొనగాడైన పూరీ .. ఈ మూవీని ఈ సమ్మర్ లోనే విడుదల అయ్యేలా ప్లాన్ చేశాడని ఫిల్మ్ నగర్ వర్గాల వారి సమాచారం. ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ.. ఫైటర్ మూవీకోసం డిఫరెంట్ మేకోవర్ తో కనిపిస్తాడట. మరి ‘ఫైటర్’ ఏ స్థాయిలో అభిమానుల్ని మెప్పిస్తాడో చూడాలి.

Leave a comment

error: Content is protected !!