Shopping Cart 0 items - $0.00 0

పవర్ స్టార్ – క్రిష్ కాంబో వచ్చేనెల్లోనే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  మళ్ళీ తెరమీదకొచ్చి.. సీరియస్ లుక్కిచ్చి మెడ మీద పాముతూ తన ట్రేడ్ మార్క్ మేనరిజాన్ని ఎప్పుడు ప్రదర్శిస్తాడా అని ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వారందరి ఎదురుచూపులకు ఇప్పుడు సరైన సమయం వచ్చింది. పవన్ మళ్లీ ముఖానికి మేకప్ వేసుకొని వరుస సినిమాలతో తన ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించే పనిలో ఉన్నాడు.

పవర్ స్టార్, శ్రీరామ్ వేణు కాంబినేషన్ లో బాలీవుడ్ ‘పింక్’ రీమేక్ ‘లాయర్ సాబ్’ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ రోజే స్టార్టయింది. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రానికి సంబంధించిన వివరాలు కూడా తెలిశాయి. క్రిష్ దర్శకత్వంలో ఎ.యం.రత్నం నిర్మాణంలో ఒక మూవీ వచ్చేనెల్లోనే ప్రారంభం కాబోందని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో పవన్ కు కూడా భాగస్వామ్యం ఉన్నట్టు సమాచారం. ఆయనకి కళ్ళు చెదిరే స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడంతో పాటు.. వచ్చే లాభాల్లో కూడా వాటా ఇవ్వనున్నారట. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ఎంచుకుంటోన్న సోషల్ అవేర్ నెస్ కథాంశాల మాదిరిగానే ఈ సినిమా కాన్సెప్ట్  ఉండబోతున్నట్టు వినికిడి. సామాజిక సమస్యల్ని తెరమీదకు తెచ్చి వాటికి చక్కటి పరిష్కార మార్గం చూపడం క్రిష్ కు కొట్టిన పిండే. మరి అలాంటి దర్శకుడికి .. పవర్ స్టార్ లాంటి హీరో దొరికితే..  ఆ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

Leave a comment

error: Content is protected !!