Shopping Cart 0 items - $0.00 0

దృశ్య మాంత్రికుడు

ఆయన ఒంటికన్నుతో కెమేరా లెన్స్ లోకి  తొంగిచూస్తే.. వెండితెరమీద వెన్నెలలు కురుస్తాయి. సినిమాలోని ప్రతీ సన్నివేశం అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది.  సిల్వర్ స్ర్కీన్ కేన్వాస్ మీద కొత్త  రంగులు ఒలుకుతాయి. ఫ్రేము  ఫ్రేమూ..  ఫేమస్ అయిపోతుంది.   ఆయన పేరు పీసీ శ్రీరామ్.  సినిమాటోగ్రఫీలో కన్ను తిరిగిన మాంత్రికుడు.  సౌత్ ఇండియన్ స్ర్కీన్ మీద వండర్ ఫుల్ విజువల్స్ కు కేరాఫ్ అడ్రెస్ ఆయన.

1979 లో శ్రీరామ్ మద్రాస్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో మోషన్ పిక్చర్ ఫోటో గ్రఫీ లో డిప్లమో తీసుకున్నారు. 1981 లో ‘వా ఇంద పక్కమ్’ అనే తమిళ సినిమాతో సినిమాటోగ్రఫర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత విడుదలకు నోచుకోని మరికొన్ని సినిమాలకు ఛాయా గ్రహణం అందించాడు. అయితే 1985 లో మణిరత్నం ‘మౌనరాగం’ మూవీతో పీసీ శ్రీరామ్ తన కెమేరా పనితనం ఏపాటిదో రుచిచూపించి..  సౌత్ స్ర్కీన్ ను అబ్బుర పరిచాడు. శ్రీరామ్ పనితనానికి బాగా ముగ్ధుడైన మణిరత్నం .. ఆ తర్వాత వరుసగా ‘నాయకన్, అగ్నినక్షత్రం, గీతాంజలి, అలై పాయుదే, రోజా, తిరుడా తిరుడా , ఓకే కణ్మణి’  లాంటి మూవీస్ కు శ్రీరామ్ తోనే ట్రావెల్ చేశాడు. ఇక  అపూర్వ సహోదరగళ్, దేవర మగన్, గోపుర వాసలిలే, ఖుషీ లాంటి సినిమాలకు శ్రీరామ్ కెమేరా కన్నే ప్రాణం పోసింది.

పీసీ శ్రీరామ్ మీరా, కురుదిపునల్ (తెలుగులో ద్రోహి ), వానమ్ వాసప్పడుమ్ అనే మూవీస్ ను డైరెక్ట్ చేసి ఆ రంగంలోనూ తన టాలెంట్ చూపించాడు. నేడు పీసీ శ్రీరామ్ పుట్టిన రోజు . ఈ సందర్భంగా ఆ దృశ్యమాంత్రికుడికి బర్త్ డే విషెస్ తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే పీసీ శ్రీరామ్  

Leave a comment

error: Content is protected !!