Shopping Cart 0 items - $0.00 0

‘డిస్కోరాజా’కి మిథున్ చక్రవర్తి అంటే అంతిష్టమా?

జయాపజయాలతో సంబంధం లేకుండా..  ప్రేక్షకుల్ని ఎఫ్పటికప్పుడు  తన కొత్త సినిమాతో థియేటర్స్  కు రప్పించడం రవితేజాకే చెల్లింది. మాస్ మహారాజా ఖాతాలో సరైన హిట్టు పడి.. చాలా కాలమైంది. ఆ లోటు ను భర్తీ చేసేలా మాస్ జనానికి ‘డిస్కోరాజా’ తో మహా ట్రీట్ ఇవ్వాలని తెగ తపిస్తున్నాడు రవి. ఈ నెల 24 న విడుదల కానున్న ఈ సైంటిఫిక్ పీరియాడికల్ ఫేంటసీ మూవీలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయని, తప్పకుండా తన అభిమానుల్ని మెప్పిస్తుందనే నమ్మకంతో ఉన్నాడతడు.

ఎయిటీస్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథతో తెరకెక్కిన ‘డిస్కోరాజా’ లో రవితేజ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు దర్శకుడు వి.ఐ.ఆనంద్ రీసెంట్ ఇంట్రాక్షన్ లో ఒక హింటిచ్చాడు. అంతేకాదు ఆ పాత్ర డిస్కో మ్యూజిక్ ను ఎంతగానో ఇష్టపడుతుందని.. ముఖ్యంగా మిథున్ చక్రవర్తి అంటే ‘డిస్కోరాజా’కు చాలా ఇష్టమని చెప్పాడు. అప్పట్లో మిథున్ ‘డిస్కోడాన్సర్’ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాంతో కుర్రకారుకు అతడు క్రేజీ హీరో అయిపోయాడు. అందుకే ఆ క్రేజ్ ను ‘డిస్కోరాజా’ లో రవితేజ పాత్రతో రీక్రియేట్ చేశాడట. యస్.యస్.తమన్ సంగీతం అందించిన ఈ మూవీలో రవితేజ ఒకపాట  పాడిన సంగతి తెలిసిందే. ఇక నభా నటేశ్ , పాయల్ రాజ్ పుత్ తాన్యా కథానాయికలు గా నటిస్తోన్న ఈ మూవీ  ఏ రేంజ్ లో అభిమానుల్ని అలరిస్తుందో  చూడాలి.

Leave a comment

error: Content is protected !!