మోహన్ లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మలయాళ  హిస్టారిక్ యాక్షన్ మూవీ ‘మరక్కార్ : అరేబిక్కడలిండే సింహం’ . పాన్ ఇండియా కేటగిరిలో తెలుగు,తమిళ, మలయాళ హిందీ భాషల్లో సైతం విడుదలవుతోన్న ఈ సినిమా మార్చ్ 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. తెలుగు లో ఈ సినిమా ‘మరక్కార్ : అరేబియా సముద్ర సింహం’ గా విడుదలవుతోంది.  కొద్ది సేపటి క్రితమే విడుదలైన ఈ ట్రైలర్ ఒక గంటలో మిలియన్ మార్క్ వ్యూస్ ను సాధించింది.

15వ శతాబ్దానికి చెందిన కేరళ ముస్లీమ్ నావీ చీఫ్ కుంజాలీ మరక్కార్. పోర్చ్ గీసువారిమీద తిరుగుబాటు బావుటా ఎగురవేసిన అతడి  వీర సాహస గాథే ‘మరక్కార్’ చిత్రం.  ఇందులో ప్రియదర్శన్ కూతురు కళ్యాణీ ప్రియదర్శన్, మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ జంటగా నటిస్తూండగా.. ప్రణవ్ తన తండ్రి టీనేజ్ పాత్రను చేయనుండడం విశేషం.  ఇంకా అర్జున్ సర్జా, సునీల్ శెట్టి, మంజు వారియర్, ‘సుహాసిని  ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తోన్న ఈ సినిమా ట్రైలర్ .. చాలా రిచ్ విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కినట్టు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. మరి ఈ సినిమా మోహన్ లాల్ కెరీర్ ను ఏ రేంజ్ లో ములుపు తిప్పుతుందో చూడాలి.

ట్రైలర్ వీక్షించడానికి కింది లింక్ మీద క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=E_mLOUtqBrw

 

 

Leave a comment

error: Content is protected !!