Shopping Cart 0 items - $0.00 0

కైపెక్కిస్తోన్న తెలుగమ్మాయి

 

 

ఇప్పటి వరకూ తెలుగు తెరమీద కనిపించిన మన లోకల్ గాళ్స్ అంతా .. స్టార్ హీరోల పక్కన అవకాశాలు రాక విసిగి పోయి.. చివరికి చిన్నచిన్న పాత్రలతో సరిపెట్టుకుంటున్నారు.  ఇప్పుడు ఈషా రెబ్బా పరిస్థితి కూడా సేమ్ టు సేమ్.  అమ్మడు కొన్ని సినిమాలతో కథానాయికగా మెప్పించి.. లేకలేక  యన్టీఆర్ తో ‘అరవింద సమేత వీరరాఘవ’లో అవకాశం అందుకుంటే..  అది మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. అందుకే అమ్మడు చక్కగా  ఇన్ స్టా గ్రామ్ ను ఆశ్రయించింది. నిత్యం హాట్ ఫోటోస్ తో కుర్రకారుకు హీట్ పుట్టిస్తూ… అవకాశాల గాలం వేస్తోంది.

లేటెస్ట్ గా ఈషా బేబ్ ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫోటోస్ చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. రెడ్ గౌన్  తో ఆమె ఇచ్చిన పోజులకు కుర్రోళ్ళ ఫీజులు ఎగిరిపోయాయి. స్టైల్ గా హెయిర్ ను గాలికి వదిలేసి.. కెమెరా వంక కైపు గా చూస్తూ..ఆమె ఇచ్చిన క్లిక్ ఇప్పడు సోషల్ మీడియాను వేడెక్కిస్తోంది. కురచ దుస్తుల్లో తెలుగందమంతా ఉబికి వస్తుంటే వారంతా ఊరికే ఉంటారా? 42వేల లైక్స్ తో తమ రెస్పాన్స్ ను తెలిపారు. మరి ఈ పోజులతో అయినా.. అమ్మడు పెద్ద అవకాశాలు అందుకుంటుందేమో చూడాలి.

Leave a comment

error: Content is protected !!