Shopping Cart 0 items - $0.00 0

శుభమస్తు

జగపతి బాబు కెరీర్ లో ఘన విజయం సాధించిన కుటుంబ కథాచిత్రాల్లో ‘శుభమస్తు’ ఒకటి. 1995లో విడుదలైన ఈ సినిమా దర్శకుడు భీమినేని శ్రీనివాసరావుకు తొలి చిత్రం కావడం విశేషం. యం.యల్ మూవీ ఆర్ట్స్ పతాకంపై ఎడిటర్ మోహన్ నిర్మించిన ఈ సినిమా లో ఆమని, ఇంద్రజ, బ్రహ్మానందం, సుధాకర్, ఆలీ, తనికెళ్ళ భరణి, బాబూ మోహన్, ఏవీయస్, పద్మనాభం, సిల్క్ స్మిత తదితరులు నటించగా.. సూపర్ స్టార్ కృష్ణ అతిథిపాత్రలో మెరుస్తారు. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం , ప్రధాన తారాగణం కైకాల సత్యనారాయణ, దాసరి నారాయణరావు. వీరిద్దరూ అన్నదమ్ములుగా నటించి సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోయారు. టాలీవుడ్ లో అద్భుత విజయం సాధించిన ఈ సినిమా నిజానికి 1995 లో మలయాళంలో సూపర్ హిటైన ‘అనియన్ బావ  చేటన్ బావ’ చిత్రానికి రీమేక్ . రాజన్ పి దేవ్, నరేంద్ర ప్రసాద్ ప్రథాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో జయరామ్ హీరోగా నటించాడు. ఆ తర్వాత ఇదే సినిమాలో తమిళంలో జయరామ్ హీరోగా ‘పెరియ ఇడత్తు మాపిళ్ళై’ గా రీమేక్ అయి ఆ భాషలోనూ సూపర్ హిట్టైంది.

Leave a comment

error: Content is protected !!